ఎందరికో మార్గదర్శకులు మహమ్మద్ గాలిబు మాస్టారు

 

టేకులపల్లి, సెప్టెంబర్ 5 (జనంసాక్షి) :
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే మార్గదర్శకులని అలాంటి మార్గదర్శకుల్లో ఎంతో ఉన్నత స్థాయిలకు ఎదిగిన ఎందరికో ఆ గొప్ప మార్గదర్శకుడు మన మహమ్మద్ గాలిబు మాస్టారు. 1936 ఎర్రుపాలెం లో జన్మించిన మాస్టారు ఆ రోజుల్లోనే ఉన్నత విద్యను (బిఏ బిఈడి) అభ్యసించి 1955లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. ఒక ఐదు సంవత్సరాలు ఇతర ప్రాంతాల్లో పాఠశాలలో తప్ప పదవీ విరమణ వరకు టేకులపల్లి మండలంలోని పూర్తి కాలం పని చేశాను. ఆయన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న ఎందరో ఉన్నత స్థానాల్లో ఎదుగుదలను చూసి ఆ మాస్టారు ఎంతగానో మురిచిపోతారు. విద్యార్థులను చదువుతోపాటు ఎంతో క్రమశిక్షణగా తయారు చేసేవారు . ఆయనంటే విద్యార్థుల తల్లిదండ్రులకు అమితమైన నమ్మకం ప్రేమానురాగాలు ఉండేవి. విద్యార్థుల తల్లిదండ్రులతో ఎంతో గౌరవం మర్యాదలతో పలకరించేవారు . అలాంటి గురువు కి గురుపూజోత్సవం సందర్భంగా ఎందరో ఆయన శిష్యులు అభినందనలతో శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల మాస్టారు స్వగృహానికి టేకులపల్లి మండల కేంద్రంలోని దాస్తండా గ్రామానికి చెందిన ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ భర్త ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు హరి సింగ్ నాయక్ విద్యాబుద్ధులు నేర్పిన గురువు గాలిబు మాస్టారును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు.