ఎం వ్యాలెట్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

3

హైదరాబాద్‌,మార్చి30(జనంసాక్షి): తెలంగాణ సచివాలయంలో ఎం వ్యాలెట్‌ను తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు. మొబైల్‌లో వాహన పత్రాలు భద్రపరిచే ఎం వ్యాలెట్‌ను రవాణా శాఖ రూపొందించింది.  ఈ సందర్భంగా ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. గతంలో ఐటీ విభాగం క్రియాశీలంగా పనిచేసే పరిస్థితి లేదన్నారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కే వేళ.. ప్రజలకు అసౌకర్యం తగ్గించాలన్నారు. సాంకేతికత వినియోగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 14 శాతం నేరాలు తగ్గడానికి సాంకేతికత దోహదం చేస్తుందన్నారు. కాగా హైదరాబాద్‌కు తాగునీటి సమస్య లేకుండా చూస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కరువు, తాగు నీటి సమస్యపై చర్చ సందర్భంగా శాసనసభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నీటి డిమాండ్‌ 660 ఎంజీడీలైతే.. 350 ఎంజీడీలు సరఫరా చేస్తున్నామని, మిగిలింది ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ముందు చూపుతో గోదావరి జలాలను హైదరాబాద్‌కు తీసుకు వచ్చామని చెప్పారు. గతంలో ఏనాడూ లేని విధంగా కరువు కోసం రూ. 320 కోట్లు ప్రకటించామని పేర్కొన్నారు. కరువు, నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ అభిశీద్ది నిధులు పెంచినందున మంచినీటి సమస్యకు నిధులు వెచ్చించాలని అఆయన ఎమ్మెల్యేలను కోరారు.  12 లక్షల మంది కూలీలు ఉపాధి హావిూ కింద లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. ఎండల దృష్ట్యా ఉపాధి హావిూ పనులను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాలని ఆదేశించామని చెప్పారు. ఉపాధి హావిూ పనులు జరిగే ప్రాంతాల్లో టెంట్లు, మంచి నీటి సౌకర్యం, ప్రాథమిక చికిత్సకు అవసరమైన కిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పంచాయతీ సెక్రటరీలను త్వరలోనే నియమిస్తామని పేర్కొన్నారు. 1778 పోస్టులు ఉన్నాయి, ఇందులో వెయ్యి పోస్టులు నేరుగా, మిగతా పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తామన్నారు.