ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం
చికిత్స పొందుతున్న ఎస్సై సిద్ధయ్యను పరామర్శించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,ఏప్రిల్6(జనంసాక్షి): హైదరాబాద్ కామినేని ఆస్పత్రికి చేరుకున్న ముఖ్యమత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లాలో జరిగిన కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఎస్‌ఐ సిద్ధయ్యను పరామర్శించారు. ఎస్‌ఐ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట ¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ ఉన్నారు. ఎస్‌ఐకి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇదిలావుంటే ఎస్‌ఐ సిద్ధయ్యకు కామినేని ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. సిద్ధయ్యకు కృత్రిమ శ్వాస పక్రియ కొనసాగుతోందని తెలిపారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారు. తన సోదరుడి ఆరోగ్య పరస్థితిపై అత్యుత్సాహంతో ఎలాంటి అసత్య కథనాలు ప్రసారం చేయొద్దని ఎస్‌ఐ సిద్దయ్య అన్న విూడియాను కోరాడు. తన సోదరుడు ప్రస్తుతానికి వైద్యానికి సహకరించే స్థితిలోనే ఉన్నాడని, బీపీ, షుగర్ సైతం కంట్రోల్‌లోనే ఉన్నాయని ఆయన తెలిపారు. వైద్యులుగాని, తాము గానీ అధికారికంగా చెప్పే వరకు అనధికారిక వార్తలు ప్రసారం చేసి అందరినీ ఆందోళనకు గురి చెయ్యొద్దని సిద్దయ్య అన్న తెలిపారు. సీఎం చొరవ, ప్రభుత్వ సహాయం వల్లే తన సోదరుడు ఇప్పటి వరకు ప్రాణాలతో బతికున్నాడని ఆయన చెప్పారు. ఎన్ని కోట్లు ఖర్చయినా నా తమ్మున్ని బతికించడానికి ప్రయత్నిస్తానని, అవసరమైతే విదేశాల నుంచి వైద్యులను పిలిపిద్దామని సీఎం తనతో చెప్పినట్లు ఆయన వెల్లడించారు. సిద్దయ్యను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ కామినేని ఆసుపత్రికి వెళ్లిన సందర్భంగా విూడియాతో ఎస్‌ఐ సోదరుడు మాట్లాడారు.
హైదరాబాద్ చాలా సురక్షితమైన ప్రాంతం:నాయిని
హైదరాబాద్ చాలా సురక్షితమైన ప్రాంతమని..ప్రజల భద్రత విషయంలో భయాందోళనలు అనవసరమని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. కామినేనికి వచ్చిన ఆయన విూడియాతో మాట్లాడుతూ సిమి కార్యకలాపాల జాడలు హైదరాబాద్‌లో లేవని అన్నారు. సూర్యాపేట ఘటనలో తప్పించుకున్న మిగతా ఉగ్రవాదుల కోసం ఐదు రాష్టాల్ర పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. నల్లగొండ ఆత్మకూరు(ఎం) మండలం జానకీపురం వద్ద ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఇద్దరు వ్యక్తులు సివిూ కార్యకర్తలని దర్యాప్తు తరవాతనే తెలిసిందని ¬ంమంత్రి తెలిపారు. ఆయన వారి కోసం నల్లగొండ జిల్లావ్యాప్తంగా పోలీసులు సోదాలు చేపడుతున్నారని నాయిని తెలిపారు.జరిగిన సంఘటనల్లో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు ఎవరూ లేరని, నగరానికి చెందిన వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఏది జరిగినా హైదరాబాద్‌కు ఆపాదించటం సరికాదని, అనవసరంగా హైదరాబాద్ పేరును దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు.హైదరాబాద్ సురక్షిత ప్రాంతమని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం అన్నారు. హైదరాబాద్‌లో సిమి ఉగ్రవాదుల కార్యకలాపాలు జరగడం లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల అనుచరుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, పోలీసు బలగాలు విస్తృత తనిఖీలు చేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ సురక్షిత ప్రాంతమని నాయిని తెలిపారు. మరోవైపు తీవ్రవాద సంఘటనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వీఐపీలకు ఇచ్చే భద్రతపై అధికారులు సవిూక్ష నిర్వహించారు. నేతల కాన్వాయ్లకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయనున్నారు.
విషమంగానే ఎస్‌ఐ సిద్దయ్య ఆరోగ్యం
సిమి ఉగ్రవాదుల దాడిలో గాయపడిన ఎస్‌ఐ సిద్ధయ్య ఆరోగ్యం విషమంగానే ఉంది. కామినేని ఆస్పత్రి వైద్యులు ఉదయం సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నారు. సిద్ధయ్యకు కృత్రిమ శ్వాస పక్రియ కొనసాగుతోందని తెలిపారు. మరోవైపు సిద్ధయ్య కుటుంబ సభ్యుల్లో పోలీసులు ఆత్మైస్థెర్యం నింపుతున్నారు. గాయపడిన ఎస్‌ఐ సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. సిద్ధయ్యకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సిద్ధయ్య శరీరంలో ఉన్న నాలుగు బుల్లెట్లకు గానూ రెండు బుల్లెట్లను వైద్యులు తొలగించారు. మరో రెండు బుల్లెట్లను శరీరం నుంచి బయటకు తీసేందుకు వైద్యులు యత్నిస్తున్నారు. కానీ శస్త్రచికిత్సకు సిద్ధయ్య శరీరం సహకరించడం లేదు. పొత్తి కడుపులో ఓ బుల్లెట్, మెదడులో మరో బుల్లెట్ ఉంది. మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధయ్య భార్య కూడా కామినేనిలోనే ఉన్నారు.