ఎన్‌ఐఏ అధికారి దారుణ హత్య
లక్నో,ఏప్రిల్ 3(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లో జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారి దారుణహత్యకు గురయ్యారు.ఎన్‌ఐఏ అధికారి మహమ్మద్ టంజీమ్ దుండగులు కాల్చి చంపారు. ఎన్‌ఐఏలో డిప్యూటీ
సూపరింటెండెంట్ ¬దాలో పనిచేస్తున్న టంజీమ్ కుటుంబ సభ్యులతో ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా, బిజ్నూరు సవిూపంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు
జరిపారు.టంజీమ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. టంజీమ్ భార్యను చికిత్స నిమిత్తం నోయిడా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారిణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడిచేసి
న ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ బృందంలో టంజీమ్ ఉన్నారు.