ఎన్‌కౌంటర్‌ కాదు, ప్రతీకార హత్యలు

5

5A
ఎంపీ అసదుద్దీన్‌

సీబీఐ విచారణకు వికారుద్దీన్‌ తండ్రి డిమాండ్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి): సిమి తీవ్రవాది వికారుద్దీన్‌ సహా ఐదుగురు ఐఎస్‌ఐ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌పై ఏఐఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ

స్సందించారు. వికార్‌ గ్యాంగ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదని, ముమ్మాటికి హత్యేనని ఆరోపించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట, జానకీపురం ఘటనలకు ప్రతీకారంగానే పోలీసులు వికార్‌

గ్యాంగును హత్యచేశారని అన్నారు. దీనిపై ప్రభుత్వం లోతుగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ కోర్టుకు తరలిస్తుండగా ఎస్కార్ట్‌ వాహనంలోని పోలీసులపై దాడిచేసి తప్పించుకోజూసిన వికార్‌, అతని సహచరులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. సంచలనం రేపిన ఈ ఘటనపై వికార్‌ తండ్రి అనేక

అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమారుడిని పోలీసులే పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు.

ఎన్‌కౌంటర్‌పై సిబిఐ విచారణ చేపట్టాలి: వికారుద్దీన్‌ తండ్రి

తనకొడుకు ఎన్‌కౌంటర్‌పై సిబిఐ విచారణ జరిపించాలని వికారుద్దీన్‌ తండ్రి అంజాదుద్దీన్‌ డిమాండ్‌ చేశాడు. ఇది బూటకపు ఎన్‌కౌంటరని అన్నాడు. కోర్టులో కేసు వీగిపోతున్న దశలో, తరకుమారుడు విడుదలయ్యే సమయంలో పోలీసులు పక్కా వ్యూహంతో కాల్చి చంపారని అన్నాడు. విచారణకు ఆదేశించే వరకు తన కొడుకు శవాన్ని తీసుకోబోనని ప్రకటించాడు. వరంగల్‌ జిల్లా పెంబర్తి – నల్గొండ జిల్లా ఆలేరు మధ్య జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌ కౌంటర్లో  సివిూ తీవ్రవాది వికారుద్దీన్‌ తో సహా అతని గ్యాంగ్‌ సభ్యులు నలుగురు మరణించారు. వరంగల్‌ జైలు నుంచి వీరిని హైదరాబాద్‌ కి  తీసుకొస్తుండగా మార్గ మధ్యలో పోలీసులపై వారు ఆయుధాలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు.  ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులకు, వికారుద్దీన్‌ గ్యాంగ్‌ కీ జరిగిన కాల్పుల్లో సివిూ తీవ్రవాదులు ఐదుగురూ మరణించారు. పలువురు పోలీసులు గాయపడ్డారు. అయితే, ఇది నిజమైన ఎన్‌ కౌంటర్‌ కాదని, పోలీసులు చేసిన బూటకపు ఎన్‌ కౌంటరని వికారుద్దీన్‌ తండ్రి ఆరోపించాడు. పోలీసులపై హత్యానేరం కేసు నమోదు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని టెర్రరిస్ట్‌ వికారుద్దీన్‌ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.కేసుని సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం  ప్రకటించేవరకూ  వికారుద్దీన్‌ మృతదేహాన్ని తీసుకెళ్లమని అంజాద్‌ లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.