ఎస్సీ, ఎస్టీ కేసులపై శ్రద్ధ చూపాలి
గుంటూరు, జూలై 8 : ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ విషయంలో డిఎస్పీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రూరల్ ఎస్పీ సత్యనారాయణ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం పోలీసు కార్యాలయంలో తన ఛాంబర్‌లో డిఎస్పీలతో ఆయన ఎస్సీ, ఎస్టీ కేసులపై సమీక్షించారు. ఆయా కేసుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఆయా కేసులను విచారించాల్సిన పద్ధతులను అధికారులకు వివరించారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు విచారించాలన్నారు. ఆయా కేసుల విషయంలో సమస్యలు ఉత్పన్నమైతే తమ దృష్టికి తీసుకొని రావాలన్నారు. బాధితులకు న్యాయం జరగాలని అదే విధంగా తప్పుడు ఫిర్యాదులపై జాగ్రత్త వహించాలన్నారు. సమావేశంలో నర్సారావుపేట గురజాల క్రైం డీఎస్పీలు భాస్కర్, తులసీరామ్‌ప్రసాద్, వెంకటరామిరెడ్డి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.