ఎస్సై& కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగితే ఊరుకోం
లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర యూత్ సహాయ కార్యదర్శి అనిల్ నాయక్ హెచ్చరిక
టేకులపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి ): ఎస్సై & కానిస్టేబుల్ ” ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్స్ అమలులో అన్యాయం జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని గిరిజన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర యూత్ సహాయ కార్యదర్శి మూడు అనిల్ నాయక్ హెచ్చరించారు. జరిగిన పరిణామాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వెంటనే రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఒక వైపు ఈ డబ్ల్యు ఎస్ పేరిట 10% రిజర్వేషన్స్ అమలు చేస్తూ మరో వైపు ఎస్సీ, ఎస్టీ అవకాశాన్ని భారత రాజ్యాంగానికి/ రిజర్వేషన్స్ వెసులుబాటును తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.2016, 2018 లో వచ్చిన ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్ లలో ఓసి-80, బిసి – 70, ఎస్సీ ఎస్టీలకు- 60 మార్కులకు క్వాలిఫైయింగ్ మార్క్స్ లు ఎలాంటి నెగెటివ్ మార్కులు లేకుండా నిర్ణయించారు. కానీ ఈ మధ్యకాలంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో నెగిటివ్ మార్క్స్ పెట్టి అందరికీ సమానంగా 60 క్వాలిఫైయింగ్ మార్క్స్ లాగా నిర్ణయించారు.
ఇది రిజర్వేషన్ స్ఫూర్తికి / బడుగు వర్గాల కు రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటుకు విరుద్ధం అని ఓసీలకు 20 మార్కులు తగ్గించి, బీసీలకు 10 మార్కులు తగ్గించి, *ఎస్సీ ఎస్టీలకు ఒక మార్క్ తగ్గించకుండా తీవ్ర నష్టం చేశారని అన్నారు .దీనిని గిరిజన లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అన్నారు.
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న ఈ రిజర్వేషన్ వ్యతిరేక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు టి ఎస్ పి ఎల్ ఆర్ బి (TSPLRB) న్యాయం చేసేంతవరకు వారి తరఫున ఉండి పోరాటం చేస్తామని తె�