ఏకమైన జనతా పరివార్‌

2

2A
సమాజ్‌వాదీ జనతాగా  ఆవిర్భావం

అధ్యక్షుడుగా ములాయం సింగ్‌

రాజ్యసభనేతగా శరద్‌ యాదవ్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌15(జనంసాక్షి): దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విడిపోయిన దళాలు మళ్లీ జనతాగా కుదురుకున్నాయి. ఒక్కతాటిపైకి రావడం ద్వారా బిజెపికి ప్రత్యమ్నాయంగా నిలవాలని నిర్ణయించాయి. ఆరు పార్టీల విలీనంతో జనతా పరివార్‌ పార్టీ ఏర్పడింది. గతంలో జనతా పార్టీ నుంచి విడిపోయిన సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ, ఆర్జేడీ, జేడీఎస్‌, ఐఎన్‌ఎల్‌డీ, సమాజ్‌వాదీ జనతా పార్టీలు తిరిగి ఒకే గూటి కిదికి చేరాయి.   కొత్తగా ఏర్పడిన పార్టీకి ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ ములాయం సింగ్‌ నేతృత్వం వహిస్తారు. దీనికి సంబంధించి ఎన్నికల గుర్తును తర్వరలో ప్రకటించనున్నారు. అలాగే ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియచేయాల్సి ఉంటుంది. దీంతో జనతా పరివార్‌లోని ఆరు పార్టీల విలీనం చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి ఆరు పార్టీల నేతలు హాజరయ్యారు. కొత్త ఫ్రంట్‌ పేరు సమాజ్‌వాది జనతా పార్టీ గా నిర్ణయించారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ దీనికి అధ్యక్షత వహించనున్నారు. కొత్త పార్టీకి రాజ్యసభ పక్ష నేతగా శరద్‌యాదవ్‌ను నియమించారు.  సమావేశం అనంతరం నేతలు విూడియా సమావేశంలో మాట్లాడారు. త్వరలో పార్టీ పేరు, గుర్తు, విధి విధానాలను నిర్ణయించనున్నట్లు నేతలు తెలిపారు.

మతతత్వ శక్తులను ఓడించడానికే ఆరు పార్టీలు విలీనం అయినట్లు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చెప్పారు. బీహార్‌ ఎన్నికల్లో జనతాపరివార్‌ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. మా మధ్య భేషజాలు లేవని, అందరం ఒకటేనని లాలూ చెప్పారు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు మేం ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు. బీజేపీని గద్దె దింపడమే మా లక్ష్యమని లాలూ స్పష్టం చేశారు. నూతన పార్టీ దేశ రాజకీయాలను కొత్త దిశగా తీసుకువెళుతుందని నితీష్‌కుమార్‌ అన్నారు. బీహార్‌ ఎన్నికలకు ముందు పార్టీ కొత్త దిశను చూపిస్తుందని ఆయన అన్నారు.. నూతన పార్టీ విధివిధానాల కోసం కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. జనతాపరివార్‌ పునరేకీకరణకు ఓ చారిత్రక నిర్ణయమని యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజా సమస్యలను అలక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు.   బుధవారం ఢిల్లీలోని ములాయం సింగ్‌ నివాసంలో

సమావేశం అనంతరం పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని నేతలు అధికారికంగా వెల్లడించారు.  ఈ సమావేశానికి బీహార్‌  ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, శరద్‌ యాదవ్‌, కేసీ త్యాగి, హెచ్‌డి  దేవెగౌడ, లాలూ ప్రసాద్‌, కమల్‌ మొరార్క, దుష్యంత్‌  చౌతాల,రాంగోపాల్‌ యాదవ్‌ తదితర కీలక నేతలు హాజరయ్యారు. మతతత్వ శక్తులను నిలువరించడమే తమ ప్రధాన లక్ష్యమని, నవంబర్‌ లో జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నమని నేతలు ప్రకటించారు. జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది.గతంలో జనతా పార్టీలో భాగస్వాములుగా ఉండి,ఆ తర్వాత చీలిపోయిన వివిధ పార్టీలు ఇప్పుడు ఏకం అవుతున్నాయి. సమాజవాది పార్టీ అధ్యక్షుడు మూలాయం సింగ్‌ ఈ పార్టీకి అద్యక్షుడుగా ఉండబోతున్నారు. బీహారు ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ , మాజీ ప్రధాని దేవెగౌడ,తదితరులు పాల్లొన్న ఈ సమావేశంలో ఆరు పార్టీలు విలీనం అవుతున్నట్లు ప్రకటించాయి.ఈ పార్టీకి సంబందించిన విధి,విధానాలు తదితర అంశాలను తయారు చేయడానికి ఒక కమిటీని వేస్తున్నట్లు ప్రకటించారు.ఈ కొత్త పార్టీ రెండు రాష్టాల్ల్రో అదికారంలో ఉన్నట్లు అవుతుంది. బీహారులో నితీష్‌ కుమార్‌ , ఉత్తరప్రదేశ్‌ లో అఖిలేష్‌ యాదవ్‌ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అయితే ఓడిషాలో అదికారంలో ఉన్న బిజెడి ఈ పార్టీలో భాగస్వామి కాలేదు