*ఏపీలో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగింపు అభ్యంతరకరం*
మునగాల, సెప్టెంబర్ 22(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న ఉభయ సభల్లో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చటం అభ్యంతరకరం అమానుషమని మండలంలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య కళాశాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి దేశములోనే తొలిసారిగా వైద్య విశ్వవిద్యాలయం నెలకొల్పిన స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరును తొలగించడం అంటే తెలుగు జాతిని అవమానించినట్లేనని, తెలుగు ప్రజల ఆత్మగౌరానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ పేరు తొలగించడం దుశ్చర్యనే అని, బీసీలకు రాజ్యాధికారం కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్ పేరు తొలగించడం ద్వారా రాష్ట్రం మొత్తం సిగ్గుపడేలా జగన్ వ్యవహరించారని, వెంటనే రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ క్షమాపణ చెప్పి బేషరతుగా ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని, ఇలాంటి అనైతిక అమానుష చర్యలను రాజకీయాలకతీతంగా పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు ఈ చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. ఇకనైనా ఇలాంటి కక్షపూరిత చర్యలను విడనాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బొమ్మ చిన్నవెంకన్న, కారంగుల వెంకట సైదులు, అల్లి చిన్నరామయ్య, పుల్లూరి ఆదినారాయణ, బారి లక్ష్మయ్య, బొమ్మ అంజయ్య, పానుగుల లింగయ్య, రేవూరి బాబు, అల్లి చిన్న, కారంగుల పుల్లయ్య, వీరబోయిన వెంకన్న, పచ్ఛిపాల వెంకన్న, వీరబోయిన అక్కులు, బొమ్మ సైదులు, షేక్ లతీఫ్, షేక్ చాంద్, షేక్ అజీజ్ మియా, మురళి, మణికంఠ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ReplyForward
|