ఏపీ నోట మోదీ మట్టి కొట్టారు

5
– సోనియా

ఎపి భవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల ఆందోళన

న్యూఢిల్లీ,మార్చి16(జనంసాక్షి): పార్లమెంట్‌ సాక్షిగా ఏపీ ప్రత్యేక హోదాపై చేసిన ప్రకటనను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ఏపీ ప్రజల నోట్లో ప్రధాని మోదీ మట్టికొట్టారని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం దిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్‌ నేతలు.. సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌, రాహుల్‌గాంధీని కలిసి ప్రత్యేక ¬దాపై సేకరించిన కోటి సంతకాల జాబితాను అందించారు.ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ ప్రత్యేక ¬దాతోనే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పునరుద్ఘాటించారు. విభజన చట్టంలోని హావిూలు అమలు కావడం లేదని ఆందోళన చెందారు. తాము పార్లమెంట్‌ వేదికగా ఆనాడు ఇచ్చిన హావిూలను అమలుచేయడంలో ప్రస్తుత ఎన్‌డిఎ సర్కార్‌ పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. ఎపీలోని అన్ని గ్రామాల నుంచి సేకరించిన మట్టిని సోనియా ద్వారా ప్రధానికి పంపనున్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వడంతోనే ఆ రాష్టాన్రికి  న్యాయం జరుగుతుందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బుధవారం విూడియాతో కాసేపు సోనియా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ విభజన చట్టంలో పేర్కొన్న హావిూలపై కాంగ్రెస్‌ పోరాడుతుందని ఆమె పేర్కొన్నారు. విభజన హావిూలు నెరవేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తెస్తామని సోనియా స్పష్టంచేశారు. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణం, పోలవరానికి నిధులు కేటాయించాలని విభజన చట్టంలో పేర్కొన్నామని, రెండేళ్లు గడుస్తున్నా విభజన చట్టం హావిూలు అమలు కావడంలేదని సోనియా ఆందోళన వ్యక్తంచేశారు.  ప్రత్యేక ¬దాకోసం కోటి సంతకాలు సేకరించడం అభినందనీయమన్నారు. విభజన చట్టంలోని హావిూలను పరిష్కరించేవరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం, పోలవరం ప్రాజెక్టు అంశాలపై పోరాడతామన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దాపై నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హావిూ ఇచ్చారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రస్తుతం ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోదీ ఏపీకి మట్టి, నీరు ఇచ్చి ముంచారని రాహుల్‌ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకు పోరాడతామని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చి ఏపీ ప్రజల ఆశలను ఒమ్ము చేశారని విమిర్శంచారు. ఏపీకి ప్రత్యేక ¬దా కల్పించాలని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హావిూ ఇచ్చారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకు ప్రధానిపై ఒత్తిడి పెంచుతూనే ఉంటామన్నారు. విభజన చట్టంలోని హావిూలను నెరవేర్చాలని కాంగ్రెస్‌ ఒంటరిగానే పోరాడుతోందన్నారు. కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ వ్యహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పలువురు కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. ఇదిలావుంటే ఠిల్లీలోని ఎపి భవన్‌లో కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ పీసీసీ నేత రఘువీరా అల్టిమేటం జారీ చేశారు. తమకు ఒంటి గంట లోపున అపాయింట్‌ మెంట్‌ ఇవ్వాలని..తమ సమస్యలు వినాలని లేనిపక్షంలో రేస్‌ కోర్సును ముట్టడిస్తామని రఘువీరా హెచ్చరించారు. ప్రత్యేక ¬దా కల్పించాలని..విభజన చట్టం హావిూలు అమలు చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా ఏపీ కాంగ్రెస్‌ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మూడు రోజుల నుండి ఏపీ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలో మకాం వేశారు. జాతీయ పార్టీల నేతలు కలిసి మద్దతు కోరారు. బుధవారం ఏఐసీసీ కార్యాలయంలో ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌ హాజరయ్యారు. సమావేశం అనంతరం గోదావరి బ్లాక్‌ వద్ద ఏపీ నేతలు ధర్నా చేపట్టారు. ప్రత్యేక ¬దా, విభజన హావిూలు అమలు పరచాలని, వెనక్కి వెళ్లవద్దని డిమాండ్‌ చేస్తున్నారు. పదేళ్లు ఇస్తామన్న వెంకయ్య నాయుడు చట్టం లేదని పేర్కొనడాన్ని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరా విూడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ వేదికగా ఇచ్చిన హావిూలను గుర్తు పెట్టుకోవాలని, మట్టి సత్యాగ్రహం ద్వారా సేకరించిన మట్టి..నీరు..కోటి సంతకాలను తీసుకోవాలని కోరారు. ఒంటి గంట లోపున అపాయింట్‌ మెంట్‌ ఇవ్వాలని, ప్రధాని దగ్గరి నుండి తమకు సమాచారం రావాలని డిమాండ్‌ చేశారు. సమచారం రాకపోతే రేస్‌ కోర్సును ముట్టడిస్తామని హెచ్చరించారు. అపాయింట్‌ మెంట్‌ ఇస్తే ఎక్కడకు పిలిచినా వస్తామని..కోటి సంతకాలు..మట్టి నీటిని అందచేయడం జరుగుతుందని..ఇచ్చిన హావిూలను గుర్తు చేస్తామని, అవకాశం ఇస్తారా ? లేదా ? అని రఘువీరా పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజల గుండెల్లో గునపాలు పొడిచిందని రఘువీరా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక ¬దాపై ప్రస్తావించిన బీజేపీ.. ఇప్పుడెందుకు మౌనంగా ఉందో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.బీజేపీ నేతలు ఏపీకి ఆర్థికసాయంపై కేంద్రంతో ఎందుకు మాట్లడటం లేదని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక ¬దా విషయంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దీంతో బీజేపీ, టీడీపీ నేతల నిజ స్వరూపం బయటపడిందని రఘువీరా విమర్శించారు.  ఇప్పటి వరకు ఏపీకి కేంద్రం ఎంత ఇచ్చిందో చెప్పాలన్నారు. టీడీపీ, బీజేపీ నేతలకు చేతకాకపోతే ప్రజల్లోకి వచ్చి ఏపీకి ప్రత్యేక ¬దా రాదన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని రఘవీరా డిమాండ్‌ చేశారు.