ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ చికోటి సంతోష్ కుమార్ ను అభినందించిన ఐఎంఏ జిల్లా అధ్యక్షులు.
సిరిసిల్ల. అక్టోబర్ 15. (జనం సాక్షి). ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ ని ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పంతగాని పెంచలయ్య అభినందించారు. ఈనెల 2న హైదరాబాద్ లో జరిగిన ఐఎంఏ రాష్ట్ర కౌన్సిల్ ఎన్నికల్లో సంతోష్ కుమార్ పోటీలో నిలిచారు.మొత్తం 452 ఓట్లు ఉండగా 400 ఓట్లు పోలవగ ఈ ఎన్నికల్లో సంతోష్ కుమార్ 250 ఓట్లను సాధించారు. పోటీలో నిలబడి గెలిచిన సంతోష్ కుమార్ ను అభినందించిన డాక్టర్ పంతగాని పెంచలయ్య రానున్న రోజుల్లో ఐఎంఏ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు.