ఐక్యతతోనే సమగ్ర అభివృద్ధి
– ఎర్రవెల్లిలో సీఎం కేసీఆర్
మెదక్,ఏప్రిల్ 20(జనంసాక్షి): తీసుకున్న రుణాలు సద్వినయోగం చేసుకుని సకాలంలో చెల్లించినప్పుడే బ్యాంకులు బాగా నడుస్తాయని సిఎం కెసిఆర్ అన్నారు. ఇందుకు ప్రజలు, రైతులు సహకరించాలన్నారు. బుధవారం ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన గ్రావిూణ వికాస్ బ్యాంక్ ప్రాంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున రూ.5 కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. బ్యాంక్ గొప్పతనం, అప్పులు తీసుకుని సకాలంలో చెల్లించే అంశాలపై ప్రజలకు బ్యాంకర్లు అవగాహన కల్పించాలని సూచించారు. ఎర్రవల్లికి బ్యాంక్ వస్తుందని ఎవరూ అనుకోలేదని, అందరం ఒక్కటయ్యాం కాబట్టి ఆదర్శగ్రామం సాధ్యమైందని చెప్పారు. ఇలాగే ఒక్కొక్కటి అన్నీ వస్తాయన్నారు. ఎర్రవల్రి గ్రామం ఒక్కటే కాదు.. తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
బ్యాంకులనుంచి అప్పు ఎవరు తీసుకున్నా దాన్ని తిరిగి సకాలంలో చెల్లిస్తేనే మంచిదని సీఎం కేసీఆర్ అన్నారు. బ్యాంకుల గొప్పతనం, తీసుకు అప్పులు చెల్లించడంపై అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. మెదక్ జిల్లా ఎర్రవల్లిలో గ్రావిూణ వికాస్ బ్యాంకు నూతన బ్రాంచీ ప్రారంభం సందర్బంగా సీఎం మాట్లాడారు. ఎర్రవల్లి గ్రామంలో బ్యాంకు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, అందరం కలసి మెలిసి పనిచేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని సీఎం అన్నారు. అంకాపూర్ రైతుల విజయంలో ఇదే కీలకమని అన్నారు. అక్కడి రైతులు రుణాలు తీసుకుని వ్యవసాయం చేసి లాభాలు గడించారని, సకాలంలో రుణాలు చెల్లిస్తున్నారని అన్నారు. అన్నిరంగాల్లో వారు ఆదర్శంగా ఉన్నారని అన్నారు. గ్రామం అభివృద్ధికోసం ఐక్యంగా కృషి చేస్తే అన్నీ ఒక్కొక్కటి అవే వస్తాయని చెప్పారు. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయన పరిశీలించారు. వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రోనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు.