ఐటీ రంగంలో తెలంగాణ భేష్‌

5

– ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాసిన పారికర్‌

– టి హబ్‌ డిఅర్‌డివో భాగస్వామ్యానికి చొరవ

– తద్వారా హైదరాబాద్‌లో డిఫెన్స్‌ టెక్నాలజీలో పరిశోధనలకి,స్టార్టప్‌కి మద్దతు

న్యూఢిల్లీ,జూన్‌ 12(జనంసాక్షి):వినూత్నపద్దతుల్లో తెలంగాణ ఐటి శాఖను నడిపిస్తున్న మంత్రి కె.టి రామారావు కృషికి మరో సారి ప్రశంసలు లభిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఐటి రంగంలో చేస్తున్న కృషిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం టి హబ్‌ వంటి కార్యక్రమాన్ని చేపట్టి స్టార్ట్‌ అప్స్‌ కి ఇస్తున్న చేయూతను కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకి ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావుకి ప్రత్యేకంగా ఓక లేఖను రాసారు. పారికర్‌ తన లేఖలో తెలంగాణ ప్రభుత్వంతో కేంద్ర రక్షణ శాఖ పని చేస్తుందన్నారు. హైదరాబాద్‌  నగరంలో రక్షణ టెక్నాలజీ రంగంలో మరిన్ని పరిశోధనలు చేపట్టేందుకు, ఈ రంగంలో జౌత్సాహిక పరిశోధకులకి అవకాశం కల్పించేందుకు టి హబ్‌ తో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ భాగసామ్యం ద్వారా హైదరాబాద్‌ నగరంలో డిపెన్స్‌ టెక్నాలజీ రంగంలో స్టార్ట్‌ అప్‌ ఈకోసిస్టమ్‌ ను అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని కేంద్ర  మంత్రి పారికర్‌ తెలిపారు. ఈ మేరకి టిహబ్‌ తో భాగసామ్య ఏర్పాటుకి తీసుకోవాల్సిన చర్యల నిమిత్తం డిఅర్‌ డివోని అదేశించినట్టు మంత్రి తెలిపారు.

త్వరలోనే టిహబ్‌, డిఅర్‌ డివో భాగసామ్యం ద్వారా రక్షణ రంగంలో స్టార్ట్‌ అప్‌ ఈకో సిస్టమ్‌ కు మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే డిఅర్‌ డివో బృందం టి  హబ్‌ ని సందర్శించి వెళ్లింది. రెండు మూడు రంగాల్లో డిఅర్‌ డివోతో  భాగసామ్యానికి ఉన్న అవకాశాలను పరిశీలించింది. కేంద్ర మంత్రి పారికర్‌ లేఖ పట్ల ఐటి శాఖ మంత్రి కెటియార్‌ హర్షం వ్యక్తం  చేశారు. ఇప్పటికే రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వ సంస్ధలు, టెక్నాలజీ రంగంలో స్టార్ట్‌ అప్స్‌ ఈకో సిస్టమ్‌, ఏరోస్పేస్‌ పరిశ్రమ నగరంలో ఉన్న నేపథ్యంలో

హైదరాబాద్‌ లో ఢిపెన్స్‌ /ఏరోస్పేస్‌ ఇంక్యూబేటర్‌ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించమని కేంద్ర మంత్రిని కోరనున్నట్లు తెలిపారు.