ఐసిస్‌ను ఖతం చేయాలి

1

– అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌

హైదరాబాద్‌,జులై 1(జనంసాక్షి): ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ అణచివేయదగ్గ సంస్థని ఎంఐఎం పార్టీ అధినేత లోక్‌ సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు.  తాము ఐసిస్‌కు  తీవ్ర వ్యతిరేకం అని స్పష్టం చేశారు.  ఐసిస్‌ వ్యవహారాలపై దఓవైసీ తీవ్రంగా స్పందించారు. తాము ముందునుంచి ఇదే విషయాన్ని చెబుతున్నామని అన్నారు. ఐసిస్‌ అనేది ఒక అంతమొందించాల్సిన సంస్థ అని ఆయన అన్నారు. ఐసిస్‌ అంటే వ్యతిరేక భావజాలం ఉన్న మహ్మద్‌ అబుల్‌ హుదా అనే ఓ ప్రముఖ సిరియన్‌ స్కాలర్ను పిలిపించే ఆలోచనలు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో  ఇటీవల ఐసిస్‌ సానుభూతి పరులను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన తొలిసారి శుక్రవారం స్పందించారు. మిలటరీ సహాయంతో ఐసిస్‌ ను సర్వనాశనం చేయొచ్చని అంతకంటే దాని భావజాలం మొత్తాన్ని కూడా రూపుమాపాలని అన్నారు. గతంలో ఐఎస్‌ నుంచి అసదుద్దీన్‌ బెదిరింపులు ఎదుర్కున్న విషయం తెలిసిందే.  సైన్యంతో ఇస్లామిక్‌ స్టేట్‌ను నాశనం చేస్తున్నారని, వాస్తవానికి సిద్ధాంతపరంగా సమాధి చేయాలన్నారు. అందుకే ఇస్లామిక్‌ స్టేట్‌ బద్ధ శతృవైన సిరియా మేధావి ముహ్మద్‌ అబ్దుల్‌ హుదా అల్‌ యాఖూబీని హైదరాబాద్‌కు పిలిచే యోచన చేస్తున్నట్లు చెప్పారు. ఇస్లామిక్‌ స్టేట్‌ అధినేత అల్‌ బగ్దాదీ అసలు ముస్లిమే కాదన్నందుకు అల్‌ యూఖూబీ సిరియా వదిలిపెట్టాల్సి వచ్చింది. ఐఎస్‌ నుంచి ఒవైసీకి కూడా గతంలో బెదిరింపులు వచ్చాయి. అయితే ఆ బెదిరింపులు తనను బెదిరించలేవని ఒవైసీ చెప్పారు. హైదరాబాద్‌ పాతబస్తీలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులను ఎన్‌ఐఏ పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఒవైసీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.