ఐ సి డి సి ఆధ్వర్యంలో శ్రీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం

టేకులపల్లి, సెప్టెంబర్ 6 (జనం సాక్షి): ఐ సి డి సి ఆధ్వర్యంలో సులానగర్ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, చిన్న పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలు మంగళవారం నిర్వహించారు . అదేవిధంగా సులానగర్ పిహెచ్సి ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేశారు .ఈ సందర్భంగా సులానగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీర బుజ్జి, సిడిపిఓ మంగతార మాట్లాడుతూ పోషకాహారము విలువల గురించి వివరించారు . గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవడం వల్ల శిశు ఆరోగ్యంగా ఎదుగుదల ఉంటుందని అన్నారు . అదేవిధంగా ప్రసవించిన తర్వాత శిశువుకి తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు . అక్షరాభ్యాసం చేపిస్తూ పిల్లలకు క్రమశిక్షణతో చదువుపట్ల ఆసక్తి కలిగే విధంగా తయారు చేయాలన్నారు. వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత ,రక్తహీనత గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ పై అవగాహన, కోవిడ్ వాక్సినేషన్ పై అవగాహన, సీజనల్ వ్యాధులు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రోజా, కరుణ కుమారి, హెల్త్ సూపర్వైజర్ పోరండ్ల శ్రీనివాస్, ఏఎన్ఎం లు లలిత, అరుణకుమారి, అంగన్వాడీ టీచర్లు పద్మ ,రాజేశ్వరి ,మంగతాయారు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల తల్లులు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.