ఒకటి నుండి 5వ తరగతిలో విద్యార్థుల కనీస అభ్యసన సామర్ధ్యాలు శోధించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తొలిమెట్టు

పెగడపల్లి సెప్టెంబర్ 23(జనం సాక్షి ) పెగడపల్లి మండలం విద్యా వనరుల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుండి 5వ తరగతిలో విద్యార్థుల కనీస అభ్యసన సామర్ధ్యాలు శోధించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా మండలంలోని రెండు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బృందాలు మరియు ఒక మండల నోడల్ అధికారి  కలిసి పాఠశాలలను పర్యవేక్షించడం జరిగింది ఈ తొలి మెట్టు కార్యక్రమంలో విద్యార్థులకు కనీస అభ్యసన సామర్ధ్యాలు రాబట్టడానికి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నోడల్ అధికారి మరియు ఎంఈఓ  ఉపాధ్యాయులు ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్ మండల నోడల్ అధికారి సంపత్ కుమార్ ఆచారి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లచ్చయ్య రవీందర్ ఆర్ పి లు వంశీకృష్ణ సాగర్ వెంకటేశం శ్రీనివాస్ సత్యం రమేష్ రాజశేఖర్ నవీన్ శేఖర్ రెడ్డి మరియు సీఆర్పీలు రాజమల్లు మల్లేశం సంతోష పాల్గొన్నారు