ఓపెన్‌కాస్ట్‌లకు వ్యతిరేకంగా ఉద్యమం
– కోదండరాం
ఖమ్మం,ఏప్రిల్ 29(జనంసాక్షి): సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులకు వ్యతిరేకంగా త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్టు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఓపెన్ కాస్టులను ఎత్తేయాలని ఉద్యమ సమయంలో కూడా తాము ప్రతిపాదించామని అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఆదివాసీ హక్కులు చట్టాలపై అవగాహన సదస్సుకు కోదండరామ్ హాజరై మాట్లాడారు. ఓపెన్ కాస్ట్‌ల వల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. పాలకులు, సింగరేణి యాజమాన్యం దీనిపై దృష్టి సారించి ఓపెన్‌కాస్ట్‌లకు ప్రత్యామ్నాయాలు చూడాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వనరులు, సంపద అంతా ఆదివాసీలకే దక్కుతుందన్నారు. ఈ దిశగా వారు చైతన్యవంతులు కావాలని, అందరూ కలసి హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని సూచించారు.