ఓయూలో ఉద్రిక్తత

2

-పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు

హైదరాబాద్‌,మార్చి22(జనంసాక్షి): ¬ళీరోజు ఓయూ క్యాంపస్‌లో  రక్త¬ళీ ఆడారు. అకారణ విషయంలో విద్యార్థులు రెచ్చిపోయి పోలీసులపై దాడికి దిగడంతో పలువురు పోలీసులు  గాయపడ్డారు. అభంశుభం తెలియని పలువురు ¬ం గార్డుల తలలు పగిలాయి. దీంతో  చాలాకాలం తర్వాత ఓయూ భగ్గుమంది. విద్యార్థులు మరోసారి తెలంగాణుద్యమ సమయంలో లాగా రెచ్చిపోయి పోలీసులపై రాళ్లదాడికి దిగారు. లైబ్రరీ వెనుక ఎవరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న వార్త విద్యార్థుల ఆగ్రహానికి కారణమయ్యింది. అతడి వివరాలు దాచారణ కారణంగా ఓయూ విద్యార్తులు దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే ఆ హాస్టల్‌ ఈ హాస్టల్‌ అని తేడా లేకుండా ఎన్సీసీ నుంచి తార్నాకా ఆర్టీసీ ఆస్పత్రి వరకు వున్న వసతి గృహాల్లో ఉన్నవిద్యార్థులందరికీ ఈ విషయం తెలిసింది. వెంటనే ఒక్కొక్కరుగా ¬ళీ వేడుకలు పక్కన పెట్టి కదిలారు. కాసేపట్లనో చీమలదండుగా మారారు. రోడ్డువిూదనుంచి లైబ్రరీ వైపు వెళ్లేందుకు కాలు కూడా ముందుకు కదపలేనంతగా విద్యార్థులు. అక్కడక్కడా నలుగురు, ఐదుగురు పోలీసులు వారిని చుట్టుముట్టి ప్రశ్నిస్తూ విద్యార్థులు కనిపిస్తున్నారు. సరిగ్గా సరస్వతీ దేవాలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై ఆత్మహత్యకు పాల్పడని వ్యక్తిని ఓ టార్పల్‌ కాగితంలో చుట్టి ఉంచారు. పోలీసులను వివరాలు ప్రశ్నించగా ఇప్పటి వరకు ఏవిూ తెలియదని అన్నారు. రెండు రోజుల కింద చనిపోయి ఉండొచ్చని మాత్రం చెప్పారు. బాడీ డీ కంపోజ్‌ అయి దుర్వాసన వస్తుంది. అదేం పట్టించుకోకుండా విద్యార్థులు మృతదేహం ముందే కూర్చుని అతడు తమ యూనివర్సిటీ విద్యార్థేనని కావాలనే పోలీసులు వివరాలు మాయం చేశారని నినదిస్తూ ఊగిపోయారు.  ఆధారాలు మాత్రం దొరకలేదని, ఒక మొబైల్‌ ఫోన్‌ మాత్రం లభ్యమైంది అని చెప్తుండగా పోలీసులు అబద్ధం చెప్తున్నారంటూ ఆగ్రహం చెందారు. అతడి వద్ద ఒక ఐడెంటీ కార్డు కూడా ఉంది. కొన్ని డబ్బులు కూడా ఉన్నాయి. అతడి దుస్తులు చూసి గుర్తుపడతామేమోనని వాటిని కూడా తీసి దాచారు’ అని ఆరోపిస్తున్నారు. కానీ కొద్ది సేపట్లోనే అతడు విద్యార్థే కాదని, మాణికేశ్వర్‌ నగర్‌ లోని అడ్డా కూలీ అని, మాణిక్యేశ్వర్‌నగర్‌ వాసి అయిన ప్రసాద్‌ కుమారుడు బాబా అని చెప్పారు. దీంతో విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతడి వివరాలు తమకు పూర్ది స్థాయిలో చూపిస్తేనే మేం మృతదేహాన్ని పోనిస్తాం లేదంటే ఊరుకునేది లేదని, ప్రభుత్వ చర్యల వల్లే విద్యార్థి చనిపోతే అతడు కూలీగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. మాణికేశ్వర్‌ నగర్‌ కార్పొరేటర్‌ హరి  మృతదేహం తరలించేందుకు వచ్చారో అప్పుడే పెద్ద పోలీసు పటాలం దిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలు ఏమి చెప్పకుండా పోలీసులు మృతదేహం తరలిస్తుండటంతో కోపానికి లోనైన విద్యార్థులు రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య ఒక యుద్ధ వాతావరణం ఆవిష్కృతమైంది. ఓయూ పోలీస్‌ స్టేషన్‌ వరకు వేలమంది విద్యార్థులు పోలీసులను తరిమితరిమి కొడుతుండగా అదే రాళ్లను తీసుకొని విద్యార్థులపై పోలీసులు రాళ్లు రువ్వారు. దిలా ఉండగా, మాణికేశ్వర్‌ నగర్‌ నుంచి చనిపోయిన వ్యక్తి తమవాడే అని కొందరు వచ్చారు. అయితే, మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులే అలా చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు వారిని దగ్గరకు రానివ్వకుండా తరిమి కొట్టారు. ఆ తర్వాత మరో కొంతమంది అతడు తమ పిల్లాడే అని ఆ కాసేపటికి మరికొందరు తమవాడే అని ఇలా దఫాల వారిగా భిన్నమైన వ్యక్తులు చనిపోయింది తమ వాడే అంటూ రావడం, వారిలో ఆ తాలూకు బాధ ఏది కనిపించకపోవడం విద్యార్థులకు అనుమానాన్నిచ్చింది. బస్తీ వాసులతో పోలీసులు డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతదేహం తీసుకుపోనివ్వకుండా అడ్డుపడ్డారు. ఈలోగా మాణికేశ్వర్‌ నగర్‌ కార్పోరేటర్‌ హరి వచ్చి అతడి ఆధ్వర్యంలో మృతదేహాన్ని తరలించడం మొదలు పెట్టారు.విద్యార్థులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరుగుతుండగా ఓ పోలీసు వాహనం ఆర్ట్స్‌ కాలేజీ వైపునుంచి వస్తుండగా ఒకేసారి విద్యార్థులు ఆ వాహనంపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో ఆ కారును నడుపుతున్న డ్రైవర్‌ ఒక్కసారిగా రోడ్డు విూదనుంచి కారును పక్కకు తిప్పాడు. దీంతో ఆ కారు ఏకంగా చుట్టూ పేర్చిన ఫెన్సింగ్ను ఢీకొట్టి గాల్లో లేస్తూ పార్క్‌లో నుంచి చిన్నచిన్న చెట్లు ఢీకొంటూ రెండో ఫెన్సింగ్‌ ను కూడా గుద్దేసి ఏకంగా వెళ్లి ఓయూ హాస్టల్స్‌ నిర్వహణా కార్యాలయానికి బలంగా ఢీకొట్టి ఆగింది. దీంతో అందులోని డ్రైవర్కు తీవ్రగాయాలయి వాహనమంతా రక్తసిక్తంగా మారింది. విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ వాహనాన్ని రిలీఫ్‌ వ్యాన్‌ సహాయంతో ఈడ్చుకెళ్లారు. మొత్తానికి ¬లీరోజు ఓయూ రణరంగంగా మారింది. పోలీసలుకు మాత్రం రక్తాలంటాయి.

ఉస్మానియా ఆర్ట్సు కళాశాల నీటి ట్యాంకులో యువకుడి మృతదేహం

ఉస్మానియా ఆర్ట్సు కళాశాల లైబ్రరీ వెనక ఉన్న నీటి ట్యాంకులో యువకుడి మృతదేహం బుధవారం కలకలం రేపింది. దీంతో ఇక్కడికి వచ్చిన పోలీసులపై విద్యార్తులు రాళ్లదాడికి దిగారు. అయితే బుధవారం ఉదయం గమనించిన సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే, అతడు నిరుద్యోగం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్‌- 2 ఉద్యోగాల సంఖ్య పెంచాలనే డిమాండ్‌ తోనే చనిపోయాడంటూ ఆరోపించారు.  దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. పోలీసులు మృతదేహాన్ని తరలించేందుకు యత్నించగా విద్యార్థులు అడ్డుకున్నారు. అతడి ఆత్మహత్యకు కారణాలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా టెన్షన్‌ వాతావరణం నెల కొంది. మరో వైపు యువకుడి మృత దేహం పూర్తిగా కుళ్లి ఉండటంతో.. గుర్తించడం కష్టంగా మారింది. ఓ స్థాయిలో యువకుడి మృత దేహాన్ని గుర్తుపట్టేందుకు వచ్చిన మాణిక్యేశ్వర్‌ నగర్‌ వాసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసు విచారణలో అతడు విద్యార్థి కాదు..అడ్డా కూలీ అని, మాణిక్యేశ్వర్‌నగర్‌ వాసి అయిన ప్రసాద్‌ కుమారుడు బాబా అని తేలింది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం గ్రంథాలయానికి సెలవు కావడంతో కొందరు విద్యార్థులు చదువుకోడానికి వెనకవైపు వెళ్లారు. అక్కడ దుర్వాసన రావడంతో ట్యాంక్‌లో చూడగా యువకుడి మృతదేహం కనిపించింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సెల్‌ఫోన్‌, దుస్తులు, సూసైడ్‌నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో విచారణ జరిపించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్శిటీ విద్యార్థిగా గుర్తిస్తే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులు రాళ్లు రువ్వడంతో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. విద్యార్థులను చెదరగొట్టేందకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ప్రస్తుతం ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు.