ఓ రాజకీయ నాయకుడి రాసలీలల వీడియోకి బలే గిరాకి…
వీడియో ఫుటేజ్ కోసం పోటీపడుతున్న నాయకులు.
సిరిసిల్లలో దుమారం రేపుతున్న ప్రముఖ నాయకుడి రాసలీలల సెల్ఫీ వీడియో వ్యవహారం.
సిరిసిల్ల. అక్టోబర్ 22. (జనం సాక్షి.) సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు ఓ మహిళతో జరిపిన రాసలీలల సెల్ఫీ వీడియో వ్యవహారం దుమారం రేపుతుంది. ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు ఒకరు ఓ మహిళతో కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ లాడ్జిలో రాసలీలల్లో మునిగి తేలుతుండగా ఆమహిళ సెల్ఫీ వీడియో తీసినట్లు సమాచారం. సరదాగా తీసిందిలే ఏమవుతుంది అనుకున్నాడో ఏమో ఆ నాయకుడు. ఇప్పుడు ఆ వీడియోనే ఆ నాయకుని కొంపముంచేలా మారిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. సెల్ఫీ రాసలీలల వీడియో వ్యవహారం బయటకు పొక్కడంతో మరికొందరు అదే పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఆ వీడియోను దక్కించుకునేందుకు భేరసారాలకు దిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కొందరు నాయకులు ప్రత్యేకంగా ఆసక్తిని కనపరుస్తూ వీడియో కోసం వేలంపాటలో రేటు పెంచినట్లు పెంచుకుంటూ పోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిజానికి రాసలీల సెల్ఫీ వీడియో నిజమో అబద్దమో అన్నది పక్కన పెడితే వీడియో సంపాదించేందుకు చేస్తున్న ప్రయత్నాల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్నది తేలాల్సి ఉంది. నాయకుల బేరం బెడిసి కొడితే నిజాలు అన్ని బయటకు రావచ్చునని ప్రజలు చర్చించుకుంటున్నారు .