కట్జూకు మెదడు చిట్లింది

1

ఆయన వ్యాఖ్యలను ఖండించిన రాజ్యసభ

న్యూఢిల్లీ,మార్చి11(జనంసాక్షి): జాతిపిత మహాత్మాగాంధీపై చేసిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కేండేయ ఖట్జూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను రాజ్యసభ తీవ్రంగా ఖండించింది. పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే కట్జూ ఈ దఫా జాతిపిత మహాత్మా గాంధీని టార్గెట్‌ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలుగుప్పించారు. గాంధీజీ బ్రిటీష్‌ ఏజెంట్‌ అని, ఆయన వైఖరితో దేశానికి తీవ్ర నష్టం కలిగించారని ఖట్జూ తన బ్లాగ్‌లో రాసిన వ్యాసం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఖట్జూ మహత్మా గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజ్యసభలో పెద్ద దుమారమే లేపాయి. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆయనపై చర్య తీసుకోవాలని కోరాయి. జైల్లో వేయాలని డిమాండు చేశాయి. మంగళవారం మహత్మా గాంధీ బ్రిటీష్‌ ఏజెంట్‌ అని, నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ జపానీయుడని మార్కండేయ కట్జూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఖట్జూ వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యసభ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది. గాంధీజీ రాజకీయల్లో మతాన్ని చొప్పించేపని కొనసాగించారని, తద్వారా విభజించి పాలించాలనే బ్రిటిష్‌ పాలకుల వ్యూహాం పక్కాగా అమలయ్యేందుకు సహకరించారని ఖట్జూ వి మర్శలు గుప్పించారు. అంతేకాకుండా గాంధీ చేపట్టిన సత్యాగ్రహ విధానం పనికి రానిదని, విప్లవాత్మక దిశగా సాగుతున్న స్వాతంత్యోద్య్రమాన్ని దారి మళ్లించేందుకే ఆయన ఈ విధానాన్ని తీసుకువచ్చారని దుయ్యబట్టారు. సత్యాగ్రహం విధానం వల్ల బ్రిటీష్‌ పాలకులకే లాభం చేకూరిందన్నారు. గాంధీ ఆర్థిక విధానాలు దేశాన్ని తిరోగమన దిశలో తీసుకెళ్లేవని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయన ప్రకటించిన గ్రామ స్వరాజ్య విధానం కులాలకు సమర్థిస్తుందని, అది అమల్లోకి వస్తే గ్రావిూణులు భూస్వాములు, షావుకార్ల గుప్పిట్లో చిక్కుకుపోయేవారని ఖట్జూ విశ్లేషించారు. గాంధీ ప్రసంగాలు, రాతలను చదివితే ఆయన దేశం విూద హిందూమత విధానాలను రుద్దినట్లు స్పష్టమవుతోందని, రామరాజ్యం, గోరక్ష, బ్రహ్మచర్యం, వర్ణాశ్రమ ధర్మం ఇందుకు నిదర్శనాలు అని వ్యాఖ్యానించారు. గాంధీ వల్లే దేశంలో మతపరమైన విబేధాలు తలెత్తాయని మర్కండేయ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. అంతేగాకుండా .’మహాత్మాగాంధీ-ఫాదర్‌ ఆఫ్‌ ది నేషన్‌, వాజ్‌ ఏ బ్రిటీష్‌ ఏజెంట్‌ ‘ అంటూ కట్జూ తన బ్లాగులో రాసుకున్నారు. బ్రిటీష్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ భారతదేశానికి మహాత్ముడు హాని చేశారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా గాంధీని బ్రిటీష్‌ ఏజెంట్‌ అనడానికి గల ఆధారాలను తన బ్లాగులో వివరించారు కట్జూ. బ్రిటీష్‌ వారి విభజించు-పాలించు అనే విధానాన్నే గాంధీ అనుసరించారని మార్కండేయా తెలిపారు. అలాగే ఆంగ్లేయులకు సౌకర్యంగా ఉండే… సత్యాగ్రహ ఉద్యమాన్ని తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు. విప్లవపంథా అనుసరిస్తే బ్రిటీష్‌ వాళ్లకు నష్టం జరిగేదని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మహాత్ముడి ఆర్థిక ఆలోచనలపై కట్జూ గళమెత్తారు. గ్రామ స్వరాజ్యం పిలుపుతో భూ స్వాములు, బడావ్యాపారులకు లాభం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు కట్జూ కామెంట్స్‌ సోషల్‌ వెబ్‌ సైట్లలో తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. గతంలోనూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 90 శాతం భారతీయులు ఇడియట్స్‌ అన్నారు. బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ రాష్ట్రపతి అయితే చూడాలని ఉందంటూ మనసులోని మాట బయటపెట్టారు. న్యాయ వ్యవస్థ అవినీతిపై కూడా మార్కండేయా ఆరోపణాస్త్రాలు సంధించారు. హైకోర్టు జడ్జీలు… అవినీతి కూపంలో కూరుకుపోయారని ఆయన కుండబద్ధలు కొట్టారు. నిజానికి ముక్కుసూటిగా వెళ్లే కట్జూకు వివాదాలు కొత్తేం కాదు. వివాదాల కారణంగా ఆయన తన వైఖరీ మార్చుకోలేదు. దేశ శ్రేయస్సు కోసం తాను నమ్మిన విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని మార్కండేయ అన్నారు.

తాజావార్తలు