కదలని బస్సు
– స్తంభించిన పౌర జీవనం
– ఆర్‌టీసీ సమ్మెతో నిలిచిన రవాణా
హైదరాబాద్,మే 6 (జనంసాక్షి):
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి బస్సులు అక్కడే డిపోలకు పరిమితం అయ్యాయి. అర్థరాత్రి నుంచి బస్సులు డిపోలు వదిలి రాలేదు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 23వేల బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాాం చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలంగాణ, ఆంధ్రప్రదేaలో బుధవారం సమ్మెకు దిగాయి. 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్న కార్మికసంఘాల డిమాాం పై.. యాజమాన్యం స్పష్టమైన హావిూ రానందున ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టాయి. సమ్మెను నివారించేందుకు ఆర్టీసీ యాజమాన్యం సహా ఆంధప్రదేa, తెలంగాణ ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నాలు చేసి విఫలమయ్యాయి. కార్మిక సంఘాలను బుజ్జగించి సమ్మెను వాయిదా వేయించేందుకు తుది వరకూ ప్రయత్నాలు జరిగినా ఫలితం దక్కలేదు. 27 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు యాజమాన్యం సంసిద్ధత వ్యక్తం చేసినా కార్మిక సంఘాలు దిగిరాలేదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే తప్ప సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పాయి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి కమిటీలు వేశామని… వాటి నుంచి నివేదిక వచ్చిన అనంతరం పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఇరు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు హావిూ ఇచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో అన్ని జిల్లాల్లో బస్సులు డిపోకు పరిమితం అయ్యాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. కార్మికులు ఉదయం నుంచి బస్ డిపోల ఎదుట బైఠాయించి తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
జగిత్యాలలో డిపోలకే పరిమితం
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో కరీంనగం జిల్లా జగిత్యాల ఆర్టీసీ డిపోలో అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిచిపోయాయి. డిపోలో 125 బస్సులు ఉండగా ఒక్క బస్సు కూడా కదల్లేదు. సమ్మె విషయం తెలియక బస్సులు కోసం వేచిచూసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఖమ్మంలో ఆగిన ఆర్టీసీ బస్సులు
కఆర్టీసీ సమ్మె కారణంగా ఖమ్మం జిల్లాలో డిపోల్లోనే బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రకటించినా, తాత్కలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం చేపట్టకపోవడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాలో ఉన్న 50 అద్దె బస్సులను నడిపేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో కార్మిక సంఘాలు వాటిని అడ్డుకున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దడంతో ఆర్టీసీ అద్దె బస్సులు రోడ్డెక్కాయి.
హన్మకొండ బస్టాాంలో ఉధ్రిక్తత
హన్మకొండ బస్టాాంలో ఉధ్రిక్తత చోటుచేసుకుంది. ప్రయాణికులను ప్రైవేట్ వాహనాల ద్వారా చేరవేస్తుండగా ఆర్టీసీ సిబ్బందికి ప్రైవేట్ డ్రైవర్లకు మధ్య తోపులాట జరిగింది. ఓ ప్రైవేట్ డ్రైవంపై ఆర్టీసీ కార్మికుడు చేయి చేసుకున్నాడు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసి బస్టాాం వద్ద ఉధ్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. భారీగా పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రతను ఏర్పాటు చేశారు.
గ్రేటం పరిధిలో ఆగిన బస్సులు
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె గ్రేటం హైదరాబా’ పరిధిలో కొనసాగుతుంది. గ్రేటం పరిధఙలోని 28 డిపోల్లో 3,500 బస్సులు నిలిచిపోయాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాాంల నుంచి దూరప్రాంతాలకు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్న ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమౌతుంది. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక నియామకాల కోసం వస్తున్న నిరుద్యోగ యువకులను కార్మికులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసులు డిపోల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే అదునుగా భావిస్తున్న ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల వద్ద నుంచి మూడు రెట్ల ఛార్జీలు వసూలు చేస్తున్నారు. గ్రేటం హైదరాబా’ పరిధిలోని 28 డిపోల్లో 3,500 సిటీ బస్సులు నిలిచాయి. అదేవిధంగా మహబూనగం జిల్లాలో 9 డిపోల పరిధిలో 858 బస్సులు, ఆదిలాబా’లో 6 డిపోల్లో 584 బస్సులు, ఖమ్మం జిలాల్లోని 6 డిపోల్లో 640 బస్సులు, నల్లగొండ జిల్లాలోని 7 డిపోల పరిధిలో 750 బస్సులు, వరంగల్ జిల్లాలోని 9 డిపోల్లో 951 బస్సులు, మెదచీ జిల్లాలోని 7 డిపోల్లో 610 బస్సులు, కరీంనగం జిల్లాలోని 11 డిపోల్లో 900 బస్సులు, నిజామాబా’ జిల్లాలో 6 డిపోల్లో 619 బస్సులు, రంగారెడ్డి జిల్లాలో 6 డిపోల పరిధిలో 610 బస్సులు నిలిచిపోయాయి.