కనుమరుగైపోతున్న చెరువులు, కుంటలు
నీరు సకల జనులు, సకల జీవరాశులకు ప్రాణా ధారం వర్షం. సముద్రాలు, నదులు, చెరువులు, కుంటలు, కాల్వల ద్వారా మనకు నీరు దొరు కుతుంది. అపరమయిన వనరుగా ఉన్న నీరు ఇపు డు దొరకడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు కుంటలు పూర్తిగా మట్టి నిండిపోయినవి దీంతో అడపాదడపాగా వచ్చిన వర్షాల వల్ల నీరు నిల్వ ఉండలేకపోతుంది. మత్తడి ద్వారా నీరు వృధాగా పోతుంది. దీంతో తరచుగా నీటి కొరత ఏర్పడటం తో తాగునీరు దొరకడం కష్టతరంగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అడ్డు అదుపు లేకుండా పెరిగిపోవడంతో చెరువులు కుంటలు అన్యాక్రాం తనికి గురవుతున్నాయి. దీంతో రైతులు వ్యవసా యం చేసుకోలేక బావులు ఎండిపోయి. జానేడు పోట్టను నింపుకోవడానికి దూర ప్రాంతాలు వెళ్తి దుర్భరమైన జీవితాలు బిక్కుబిక్కుమంటు గుడుపు తున్నారు. చెరువులు కుంటలు ఎండిపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. చెరువులు కుంటల్లో పూడికలు చేరి నీటి శాతం దిన దినంగా అడుగంటిపోతున్నాయి. వీటికి నీరందించే కాల్వలు నాలాల్లోను పూడికలు ఏర్పడి నీరు అందడం లేదు. అధికారులు పట్టించుకోనట్లుగా వ్యవహరిం చడంతో రాను రాను చెరువల సంఖ్య కుదించబడుతుంది. ప్రకృతి కాపాడుటకు వాతావరణ సమతుల్యతకు, పచ్చదనానికి, పరిశుభ్రతకు, చల్లదనానికి ఊతమిచ్చే జలాశయాలు చెరువలు కుంటలు సమాజానికి ఎంఒతో మేలు చేస్తాయన్న విషయాన్ని పాలకులు గుర్తించకపోవడమే ప్రధాన కారణం హైదరాబాద్ మహానగరాల్లో ఒకప్పుడు ఏడువేల ఏడువందల ఇరవైఐదు చెరువులుండగా ఇపుడు కేవలం ఏడు వందల ఇరవై ఐదు చెరువులు మాత్రమే మిగిలిఉ న్నాయి. కొన్ని చెరువులు చెత్త కుప్పల్లాగా మారుతూ కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. మరికొన్ని చెరువులు భూ కబ్జాదారుల చేతిలో అన్యాయానికి గురయినవి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల చెరువుల ఉండేవి. నేటికి వాటి సంఖ్య క్రమ క్రమంగా తగ్గిపోయి ంది. మిగిలినవి రెండు లక్షల చెరువులు మాత్రమే. తెలంగాణ ప్రాంఈంతొస్త్రంలో లక్షా 30 వలే చెరువులుండేవి. నేడు కేవలం 30 వేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎఫ్‌టిఎల్ నిబంధనలకు విరుద్దంగా కబ్జాలు చేసి చెరువుల కుడిపెస్తున్నారు. ఎఫ్‌టిఎల్ లోనే ఏకంగా ఎళ్ల నిర్మాణాలు చేస్తున్నారు. నిన్నటి వరకు నాలాలను మింగేసిన ఘనులు ఇపుడు ఉన్న చెరువలను మింగేస్తున్నారు. ఇలాగే కొనసాగినట్లయితే భవిష్కత్‌తో చెరువుల చూద్దామన్న కనిపించకుండా పోయే ప్రమాదముంది. వాల్టా చట్టం కింద మండల స్ధాయిలో తహశీల్దార్ అధ్యక్షతన ఒక కమిటీ పని చేస్తుం ది. ఇందులో అన్ని విభాగాలకు చెందిన మండల స్థాయి అధికా రులు సభ్యులుగా ఉంటారు. డివిజన్ స్ధాయిలోఆర్డీవో జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇంత మంది అధికార లున్న చెరువులు మాత్రం కాపాడలేకపోతున్నారు. చెరువులు కబ్జాకు గురవుతున్నాయని, అధికారలుకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. నిఘా కొరవడిరది. కోట్ట రూపాయల లావాదేవీలు జరగడంతో ఎవ్వరి వాట వారికి అందుతోంది. వాల్టా చట్టం ప్రకారం నీటి చౌర్యం చేస్తూ దొరికిపోతే 10 వేల రూపాయల వరకు జరిమాన విధించే వీలుంది. అక్రమంగా వాటర్ ట్యాంకర్లు, బోర్‌ను సీజ్ చేస్తారు. రెండోసారి దొరికినట్లయితే లక్షరూపాయల వరకు జరిమానా విధించవచ్చు. వాల్టా చట్టం ఎక్కడా అమలు కావడం లేదు ప్రపంచ బ్యాంక్ జపాన్ ప్రభుత్వ సహకారంతో 1500 మైనర్ ఇరిగేషన్ చెరువులను బాగు చేయడానికి కొత్తవి నిర్మించడాని కి 15 వందల కోట్ల రూపాయల సహయం తీసుకుంది. ఐదేండ్ల కింద పూర్తి చేయాల్సిన పనులకు ఇంత వరకు మోక్షం కలగలేదు. తూములు, మత్తడులు నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించకపోవడం వల్ల రాను రాను మైనర్ ఇరిగేషన్‌లు పనికి రాకుండా పోతున్నాయి. వివిధ ప్రాజెక్టులలోకి 80 శాతం నీను రాగానే తూముల ద్వారా 25 వేల చెరువులను నింపడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ప్రాజెక్టులతో మైనర్ ఇరిగేషన్ అనుసంధానం చేయడం మూలంగా భూగర్భ జలాలు పెరుగడమే కాకుండా గాలిలో తేమ శాతం పెరుగుతుంది. పాడిపరిశ్రమ అభివృద్ది చెందుతుంది, మనషులకు పశువులకు తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. గడిచిన ఎనిమిది సంవత్సరాలలో సాగునీటికై (2004`12) అత్యధిక నిధులను ఖర్చు చేసినప్పటికి అత్యధిక భాగం కాంట్రాక్టర్లు పాలక వర్గ పార్టీల నాయకులు జేబులు నింపుకోడానికి సరిపోయింది. ఖర్చయిన మిగిలిన భాగం ఆ పనులు పూర్తి కాలేకపోయి నాయి కాగ్ నివేదికలో జలయజ్ఞం ధన యజ్ఞంగా మారి వలే కోట్ల రూపాయల నిధులను దిగమిం గారని సాక్ష్యాలతో సహా నిరూపించింది. అందుకు బాద్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేశారు. మధ్య తరహా చినÊ ప్రాజెక్టులు పూర్తి చేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రమంతా సస్యశ్యామలం అవుతుంది. అంతరాష్ట్ర జల వివాదాల జాప్యం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరుగుతుంది. గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో బాబ్లీతో పాటు మరో 11 చిన్న ప్రాజెక్టుల నిర్మాణం చేసి మహారాష్ట్ర నీరు రాకుండా చేసింది. మంజీరా నదిపై సింగూరు ప్రాజెక్టు ఎగువన కర్ణాటక అక్రమ నిర్మాణాలు చుపట్టి హైదరాబాద్ నగరానికి నీరందించే సింగూరుకు నీరు రాకుండా చేసింది. అంతరాష్ట్ర జలవివాదాలపై ఏకాభిప్రాయం సాధించి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు తగు చర్యలు తీసుకోవాలి. 2005లో జలయజ్ఞం పధకం ద్వారా 26 భారీ ప్రాజెక్టులు 5 ఏళ్లలో పూర్తి చేసి 46 లక్షల ఎకరాలకు సాగు నీటి వనరుల కల్పిస్తామన్న ప్రభుత్వం నేటికి ఎనిమది సంవత్సరాలయినా ఎ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. శ్రీరాంసాగర్ నాగార్జునసాగర్ ప్రజాక్టులలో పూడికతో నిండిపోయింది. చెరువుల తగ్గిపోవడానిని అనేక మయినా కారణాలున్నాయి. చెరువులు కుంటలు పరిరక్షణకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి మన చెరువుల, కుంటలు మనమే పరిరక్షించుకోవాలి. చెరువులు, కుంటలు కనుమరుగైపోతే మానవ జీవితమే సమాప్తం.
` దామోదర రాజనర్సింహారెడ్డి