కన్హయ్య కుమార్ దేశద్రోహి కాదు
– ఉద్ధవ్ థాకరే
ముంబై,ఏప్రిల్ 24(జనంసాక్షి):అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ జెఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్యను దేశ ద్రోహి అనడం తగదని శివసేన సూచించింది. కన్నయ్యను తప్పుడుగా దేశద్రోహి అంటున్నారని విమర్శించారు. దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న యువతకు సరైన మార్గదర్శకం ఇవ్వాల్సింది పోయి వారిని పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని థాకరే ఆరోపించారు. రోహిత్ వేముల, హార్ధిక్ పటేల్, కన్నయ్యలపై దేశ ద్రోహ అభియోగాలు మోపడం తగదన్నారు. ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యలతో బిజెపి నేతలు షాక్‌కు గురయ్యారు. మహారాష్ట్రలో శివసేన, బిజెపి సంకీర్ణ సర్కారును నడుపుతున్నాయి.