కరపత్రం నిర్బంధంతో ఉద్యమాన్ని అణచగలరా?

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన చలో అసెంబ్లీ ఉద్యమ పోరాట రూపానికి అనుమతివ్వకుండా బైండోవర్‌ బెదిరింపులు అరెస్టులతో ఉద్యమ కారులపై అమలు చేస్తున్న పోలీసు నిర్బంధాన్ని ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈమేరకు కరపత్రాన్ని విడుదల చేసింది. ఆ కరపత్రం యథాతదంగా…

తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం తెలంగాణ ఉద్యమకారులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం అనుమతి నిరాకరించడం ఒక అప్రజాస్వామిక చర్యగా మేం పేర్కొంటున్నాం. అనుమతి ఉన్నా లేకున్నా ఉద్యమకారులు కార్యాచరణకు సిద్దమవడం వారి చైతన్యం వారి ఉద్యమ ఆంకాక్షను నిరూపిస్తుందని గుర్తిస్తున్నాం. అనుమతిపై రాష్ట్ర మంత్రులు మాట్లాడుకుండా పోలీసులే మాట్లాడటం ప్రజాస్వామిక పరిపాలన అనిపించుకోదని తెలియజేస్తున్నాం. ఈ పోలీసుల పాలనను పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల ఆకాంక్ష పట్ల ప్రభుత్వం మంత్రులతో మాట్లాడించి ఒక సామరస్యపూరిత వాతావరణం ఏర్పడడానికి ప్రయత్నించాలి కాని పోలీసులు నిర్బందంలో తెలంగాణ ప్రజల జీవితాలు అనే విదంగా వ్యవహరిస్తున్నప ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పరిపాలనను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ అంతటా పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలు బైండోవర్లను నిఘా లాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శాంతియుత ప్రజాస్వామ్య యుత పోరాల రూపంగా గౌరవించి అమలయ్యేలా చూడాల్సిందిగా కోరుతున్నాం. ప్రజా ఉద్యయంపై తీవ్ర నిర్బందాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తే ఆ ఉద్యమం ఎటువంటి మార్పులు తీసుకున్న దానికి ప్రభుత్వమే భాద్యత వహించాల్సి ఉంటుందని తెలియజేశారు. బైండోవర్లు, ఆరెస్టులు చేపట్డకుం డ ఆ ప్రభుత్వమే అనుమతినివ్వాల్సిన భాద్యత ఉంది. ప్రజాస్వామ్యంలో చట్టం అందరికి సమానంగా అందుబాటులో ఉన్నప్పుడే ప్రజాస్వామ్య పరిథి విశాలమవడం, ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వసనీ యత పెరగడం జరుగుతుంది. ఆంద్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రజా ఉద్యమాల పట్ల ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించకుండా పోలీసుల సహయంతో నిర్భందాలకు గురిచేస్తున్నారు. ఇది ప్రజాస్వామిక పరిపాలన విధానం కాదని పౌరహక్కుల సంఘం స్పష్టం చేస్తుంది. మన దేశంలో జూన్‌ 25 1975 లో ఇందిరాగాంధీ ప్రకటించి ఎమర్జెన్సీ ఇంకా నగర పోలీసు కమిషనరీ అనుగాగ్‌ శర్మ చేతుల్లో కొనసాగుతూ ఉంది. అందుకే అనుమతి అడగలేదు. అడిగినా ఇవ్వం ఇది ఎమర్జెన్సీ చీకటి రోజుల పరిపాలన అందుకేనేమో ప్రపంచంలో ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఇన్ని ఏళ్లుగా అనేకానేక పోరాట రూపాలతో కొనసాగడం ఇక్కడే సాద్యమైంది. ఇది తెలంగాణ ప్రజల పోరాట చైతన్యమే ఇప్పటికి ఉద్యమిస్తున్నది, బలంగా పనిచేస్తుందనటంలో ఎవరికి సందేహం లేదు. 2009 డిసెంబర్‌ 10 చలో అసెంబ్లీకి కూడా వందలాది ఉద్యమ కారులను అరెస్టు చేసింది. కాని డిసెంబర్‌ 9నే తెలంగాణ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం చలో అసెంబ్లీ అనే ఒక ప్రజాస్వామిక పోరాట రూపానికి నిర్వహించబోతున్న వారిపై శాంతిభద్రతల విషయం కాని కార్యక్రమం నియంత్రణపై ఎటువంటి చట్టంబద్ద చర్యలు లేకుండా పోలీసులే ఉద్యమకారులపై బైండోవర్లు, అరెస్టులు చేయడం ప్రజాస్వామిక పరిపాలనగా పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. చలో అసెంబ్లీ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనకుండా చేయడానికి ఈ నెల 14న శాసనసభ కార్యక్రమాల దృష్ట్య ఎవరు సెలవు పెట్టకూడదని ఒక నియంత పాలనను ప్రభుత్వం కొనసాగిస్తుండడం సెలవు పెట్టినా, చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గోన్న కఠిన చర్యలు తీసుకుంటా మని బెదిరించడం ఇక్కడ ప్రజాస్వామ్య పరిపాలన అనిపించుకోదని ప్రభుత్వం గుర్తించాలని తెలిమజేస్తున్నాం. అప్రజాస్వామికంగా పరిసాలన కొనసాగిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య పరిపాలనను అందించాల్సిందిగా రాష్ట్రపతిని, ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌లను కోరుతున్నాం. దశాబ్దాలుగా భూటకపు ఎన్‌కౌంటర్ల రూపంలో లాకప్‌ హత్యల రూపంలో మిస్సింగ్‌ రూపంలో ఇప్పటకే నాజీల పరిపాలనను మించిసోయిన మన రాష్ట్ర పరిపాలన నేడు తెలంగాణ రాష్ట్ర మనే ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కూడా పోలీసు కళ్లతో చూసి అనేక రకాలైన పోలీసు హింసా రూపాలను అమలు చేస్తూనే ఉన్నారు. సమాజంలో రేపటి తరం విద్యార్థుల జీవితాలను చీకటిమయం చేయడం కోసం వేలాది కేసులు నమోదు చేయడం ఉద్యోగస్తులను కేసుల రూపంలో భయపెట్టడం, విధ్యార్థినులని కూడా చూడకుండా కరెంటు తీసి హాస్టల్‌పై రామాంజ నేయులు లాంటి పోలీసు ఆఫీసర్‌ దాడి చేయడం తెలంగాణ మార్చ్‌ను భాష్పవాయు గోళాల మార్చ్‌గా మార్చిన ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుంది. ఒక ప్రజాస్వామిక ఉద్యమం పట్ల ప్రభు త్వం ఇంత అమానవీయంగా వ్యవహరిస్తూ సుమారు వెయ్యి మంది విద్యార్థుల జీవితాలను బలితీ సుకున్న స్పందించకపోవడాన్ని భాద్యతయుతమైన ప్రభుత్వ పరిపాలణలో తెలంగాణ ప్రజలు జీవిం చడం లేదన్నదని వాస్తవం. దశాబ్దాలుగా తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు రైతులు, మహి ళలు, విద్యార్థులు చలో అసెంబ్లీ అని పోరాట రూపాన్ని ప్రకటించడం దాన్ని అమలు చేయాలను కోవడం వారి పోరాట లక్ష్యం. ఇప్పుడ అసెంబ్లీలో ఉన్న అన్నీ రాజకీయ పార్టీలు ఈ పోరాట రూపాన్ని అమలు చేసినవే. అప్పుడు అది న్యాయమైర పోరాట రూపమే. ఇప్పుడు అనుమతి నిరాకరించబడే పోరాట రూపంగాఎలా మారింది. ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్ని చలో అసెంబ్లీ పోరాట రూపాన్ని నిర్వహించినవే, కాంగ్రెస్‌ పార్టీతో సహా, ప్రజాస్వామ్యయుతంగా కొససాగుతున్న ప్రజా ఉద్యమాన్ని చట్ట విరుద్దంగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు తీసుకునే పోరాట రూపమైన న్యాయమే అవుంతుంది. వందలాది విద్యార్థులు బలిదానాలపై నోరువిప్పని ముఖ్యయంత్రి ఏ భాద్యతతో ఈ పోరాట రూపానికి అనుమతివ్వను అని అనగలడు. నైతిక అర్హత కూడా ప్రభుత్వానికి తేదని స్పష్టం చేస్తున్నాం. ఇప్పుడైనా ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా ఆలోచించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చి బాద్యతతో వ్యవహరించడమే ప్రజాస్వామిక పరిపాలనను ప్రజలకు అందించినవారు అవుతారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమం పట్ల ప్రణబ్‌ ముఖర్జీ, ఆజాద్‌, చిదంబరం, షిండేలు బాద్యతాయుతంగా వ్యవహరించ కుండా ఉద్యమ ఆకాంక్ష పట్ల చాలా హేలనగా మాట్లాడడాన్ని తీవ్రం గా ఖండిస్తూ ప్రజా ఉద్యమాలను గుర్తించి గౌరవించని ప్రభుత్వాలు చరిత్రలో పడ్డ గుర్తించి ఇకనైన తెలంగాణ విదర్బ గుర్ఖాలాండ్‌ లాంటి ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని నిర్బంద రూపాలను నిలిపివేయాలని పౌరహక్కుల సంఘంగా డిమాండ్‌ చేస్తున్నాం.