కరవును తరిమికొట్టే సమయమిదే

మంచికో చెడుకో దేశంలో కరవు కరాళ నృత్యం చేస్తోంది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. జీవనదులు వట్టిపోయాయి. పర్యావరణం ధ్వంసం అవుతోంది. ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. చెట్లను నరికి ఎండలకు అవకాశం ఇస్తున్నారు. ఇవన్‌ఈన మనకు గుణపాఠం కావాలి. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఇప్పుడే మేలుకోవాలి. ఇదే సమయంగా భావించి ఇందుకోసం ప్రజా చైతన్యంతో పాటు దిద్దుబాటు చర్యలకు పూనుకోవాలి. వీటికి నిధులను భారీగా కేటాయించి భావిష్యత్‌లో సమస్యలు రాకుండా కార్యక్రమాలు రూపొందించాలి. దేశంలోని అనేక ప్రాంతాలు కరువుతో అల్లాడుతున్న నేపథ్యంలో నీటి సంరక్షణ, నిల్వ కోసం రానున్న నెలల్లో గ్రావిూణ ఉపాధి హావిూ పథకం కింద భారీ చర్యలు చేపట్టనున్నట్టు ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారు. ఈ చర్యల్లో అధికారిక యువజన సంఘాలైన ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీలు కూడా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.  ఢిల్లీలోఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీల పనినీరుపై సవిూక్ష నిర్వహించిన సందర్భంలో ఈ వ్యాఖ్య చేశారు. ఈ సంఘాలన్నీ సమన్వయం, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని  సూచించారు. నిజంగా ఇది మంచి ఆలోచనగానే భావించాలి. అయితే కార్యక్రమాన్‌ఇ ముందుకు తసీఉకుని వెళ్లే కార్యాచరణకు పూనుకోవాలి. దేశంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ తదితర సంఘాలు తక్షణం రంగంలోకి దిగాలని కోరారు. యూత్‌ ఆర్గనైజేషన్ల ప్రతినిధులు తమ సంఘాల పనితీరు గురించి, సమాజంలో ఆయా సంఘాల  పాత్ర గురించి ప్రధాని మోదీకి వివరించారు. వారికి ప్రధాని మోదీ పలు సూచనలు, సలహాలు అందించారు. ముఖ్యంగా స్వచ్ఛత, యువతలో జాతీయ స్ఫూర్తిని పెంపొందించాలని వారికి సూచించారు. యూత్‌ ఆర్గనైజేషన్లు సామాజిక విూడియాలో చురుకుగా

పాలుపంచుకోవడం ద్వారా యువతకు చేరువగా ఉండేందుకు కృషి చేయాలని చెప్పారు. ఈ సూత్రాల ఆధారంగా ఇప్పుడు పర్యావరణ పరిరక్షిత భారత్‌ పునర్నిర్మాణం అవసరం. అందుకు కేందరమే ముందుకు దిగాలి. ప్రధాని మోడీ ఇందుకు కంకణం కట్టుకోవాలి. రాష్టాల్రను విశ్వాసం లోకి తీసుకుని అందుకు అవసరమైన విధంగా నిధులను భారీగా కేటాయించి కార్యక్రమాలు చేస్తే తప్ప ముందుకు కదలలేం.

అవినీతి, అవగాహనారాహిత్యం, ముందుచూపు లేకపోవడం, వీటన్నింటిని మించి ప్రకృతి సహాయ నిరా కరణతోడు కావడంతో కోట్లాది మంది ప్రజలు ఇవాళ మంచినీటికి పడరాని పాట్లు పడుతున్నారు. దాహం తీర్చుకునేందుకు అందుబాటులో ఉన్న కలుషిత నీటినితాగడానికి కూడా వెనకాడడం లేదు. ఇప్పటికీ ప్రజలందరికి కనీస అవసరమైన గుక్కెడు స్వచ్ఛమైన మంచినీరు అందించలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం. వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నా భూగర్‌ంభ జలాలలను కాపాడుకోలేకపోతున్నాం. జనాభా పెరుగుదలకు అనుగుణంగా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ మంచినీటి సమస్యను పరిష్కరించే వైపు అడుగులు వేయలేదనే చెప్పాలి. అంతేకాదు అనవసరంగా పర్యావరణాన్ని దెబ్బతీసుకుంటున్నామని గుర్తించడం లేదు.  కరువుల్లోనే కాదు వర్షాలు సమృద్ధిగా కురిసిన సంవత్సరాల్లో కూడా నీటి పొదుపుపై లేదా సంరక్షణపై దృష్టి పెట్టడం లేదన్నది వాస్తవం. వరస కరువులతో ఈ సారి ప్రకృతి పగబట్టడంతో పరిస్థితి మరింత విషమించింది. వందలాది గ్రామాలు మంచినీటికి అల్లాడుతున్నట్లు అధికార నివేదికలే వెల్లడిస్తున్నాయి. ఊహించని విధంగా భూగర్భజలాల మట్టం పడిపోవడంతో ఎండిపోయే బోర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాల్లో ఇదొకటి. ఏడాదికెడాది భూగ ర్భజలాలు అడుగంటడం ఆందోళన కలిగించే అంశం. రాబోయేరెండు నెలల్లో మంచినీటి సమస్యను

తాత్కాలికంగా పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదిక విూద చర్యలు చేపట్టాలి.

గత రెండు మూడు దశాబ్దాలుగా ఎన్నడూలేని కరువు రక్కసి విలయతాండవం చేయడంతో నీరు అదృశ్యమైపోతున్నది.  గ్రామాలకు గ్రామాలే తరలిపోతున్న ట్లుగా కూలీలు ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు వలస బాటపట్టారు. వేలాదిగ్రామాలు మంచినీటికి అల్లాడిపోతున్నాయి.ఇంతటి పరిస్థితి గత 20ఏళ్లుగా ఎప్పుడూ లేదని గ్రామస్థులు వాపోతున్నారు. వడగాల్పులకు, ఎండదెబ్బకు వందలాది మంది పిట్టల్లారాలిపోతున్నారు. వేలసంఖ్యలో ఆస్పత్రుల పాలవుతున్నారు.  కేందప్రభుత్వం లాతూర్‌ లాంటి ప్రదేశాలకు రైళ్ల ద్వారా నీరు అందిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వర్షాలు ఆరంభమయ్యేవరకు పరిస్థితి మరింత దిగజారిపోవచ్చునని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నీటి కొరతను ఎదుర్కొంటున్నదేశాల్లో భారత్‌ అగ్రస్థానంలోఉంది.వాస్తవంగా చూస్తే కేవలం నాలుగైదుశాతం మాత్రమే పూర్తిగా సురక్షితమైన తాజా మంచినీరు అందు బాటులోఉంది. పెరుగుతున్న జనాభాకు పారిశ్రామిక అవసరాలకు అందులోనూ ముఖ్యంగా వ్యవసాయానికి ప్రధాన ఆధారం భూగర్భజలాలే. రోజురోజుకు పెరుగుతున్న అవసరాలతోపాటు వర్షపాతం తగ్గిపోవడంతో భూగర్భజలాలు అత్యంత వేగంగా అడుగంటిపోతున్నాయి. ప్రధాని అన్నట్లుగా ఇప్పుడు దీనిపై సమరం సాగాలి. ప్రజా చైతన్యం తీసుకుని రావాలి. ఇందుకు కేంద్రం పెద్ద ఎత్తున కార్యక్రమాలను కార్యాచరణగా చేయాలి. అప్పుడే దేవంలో నెలకొన్న దుర్భర పరిస్థితులకు చెక్‌ పెట్టగలం.