కరీమాబాద్ తల్లిపాల వారోత్సవాలు
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ ప్రాంతంలోని 32 వ డివిజన్ కరీమాబాద్ అంబేద్కర్ భవన్లో అంగన్వాడీ టీచర్లు ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు పై తల్లులకు గర్భిణీలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి సూపర్వైజర్ బత్తిని రమాదేవి అధ్యక్షత వహించారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న 32 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పల్లం పద్మ రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే పౌష్టికాహార లను పుట్టిన పిల్లలకు క్రమం తప్పకుండా తినిపించాలని వారి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ బాలింతలు గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్వహించే ఆరోగ్య సూత్రాలను పాటించి పిల్లల ఎదుగుదలకు తూర్పు పాటు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఆయాలు తల్లులు గర్భిణీ స్త్రీలు వారితో పాటు స్థానిక నాయకులు తరాల రాజమణి కళావతి ఆడెపు బిక్షపతి కొండరాజు స్థానిక పెద్దలు పాల్గొన్నారు