కరువు మార్గదర్శకాలకు చట్టబద్ధత కల్పించాలి

5
– ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌

జగిత్యాల మార్చి20(జనంసాక్షి): కరువు  మండలాల ఎంపిక కోసం రూపోందించిన మార్గదర్శకాలను చట్టబద్దత కల్పించాలని అప్పుడే నష్టపోయిన రైతులను సక్రమంగా నష్టపరిహారం అందుతుందని ప్రొపెసర్‌ కోదండరాం అన్నారు. అదివారం స్థానిక ఎస్పారెస్పి గెస్ట్‌హజ్‌లో ఏర్పాటు విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. దేశానికి వెన్నెముక రైతు అని అలాంటి రైతు నష్టపోయిన ప్రతిసారి ప్రభుత్వాన్ని బిచ్చం అడుక్కునే పరిస్థితి దూరమవుతుందన్నారు. తన జీవితకాలంలో ఏన్నడు చూడనంత కరువును ఇప్పుడు చూస్తున్నానని బావులు ఎండిపోయి, భూగర్బ జలాలు అడుగంటి పశుగ్రాసం దొరకక మూగ జీవాలను కబెలాలకు తరలిస్తున్నారన్నారు. జిల్లాలో అన్ని మండలాల్లో కరువు ఉందని ప్రతి మండలంలోని రైతులకు పంట నష్టాన్ని అందించాలన్నారు. కరువు మండలాలను ఎంపిక చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి జేఏసిలను బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో విద్యావంతుల వేదిక జిల్లా డివిజన్‌ అద్యక్షులు సిహెచ్‌వి. ప్రబాకర్‌రావు, సిరిసిల్ల రాజేంద్రశర్మ, చుక్క గంగారెడ్డితోపాటు పలువురు ఉన్నారు.

రోళ్లవాగు అదునీకరణకై ప్రభుత్వానికి నివేదిస్తా

సారంగాపూర్‌, ధర్మపురి మండలాలకు తాగు, సాగునీరు అందించే రోళ్ళవాగు అదునీకరణకై ప్రభుత్వానికి నివేదిస్తానని రాజకీయ ఐకాస చైర్మన్‌ ప్రొ. కోదండరాం అన్నారు. అదివారం బీర్‌పూర్‌ శివారులో గల రోళ్ళవాగు ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్బంగా అయన రైతులతో మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఎస్పారెస్పి ప్రాజెక్టు నుంచి నీరు అంతత మాత్రంగానే విడుదల కావడంతో సాగు, తాగునీరు రెండు మండలాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. అత్యవసరంగా రోళ్ళవాగు అదునీకరణ పనులు చేపట్టడం కోసమని ప్రభుత్వానికి నివేదించడమే కాకుండా ఎస్పారెస్పి ప్రాజెక్టు నుంచి కాకుండా గోదావరిలోని మోసలి మడుగు నుంచి నీటిని మళ్లించి నిరంతరాయంగా నీటి సరఫరాకు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతామన్నారు. రోళ్ళవాగును అదునీకరిస్తే ఇరవైఐదు వేల ఎకరాలకు సాగునీరు అందడంతోపపాటు రెండు మండలాల ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు. అయన వెంట ఐకాస రాష్ట్ర అద్యక్షులు, జిల్లా అద్యక్షులు గురిజాల రవీందర్‌రావు, సారయ్య, చెప్యాల ప్రభాకర్‌రావు, విధ్యావంతుల వేదిక జిల్లా అద్యక్షులు ప్రభాకర్‌రావు, రాజేంద్రశర్మ, చుక్క గంగారెడ్డి, మండల నాయకులు ఉన్నారు.