కరువు సహాయక చర్యలు చేపట్టండి
– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ డిమాండ్
హైదరాబాద్,మే4(జనంసాక్షి): రైతుల పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. కరవు సహాయచర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా కరవు తాండవిస్తుంటే కేవలం 231 మండలాలనే కరవు మండలాలుగా ప్రకటించడం భావ్యం కాదని… వీటి సంఖ్యను 443 మండలాలకు పెంచాలని కోరారు. రుణమాఫీపై అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హావిూని నిలబెట్టుకోవాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు లేఖ రాశారు. ఒకేసారి రుణమాఫీ చేయాలని పట్టుబట్టారు. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచితే.. ఒకేసారి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారని ఉత్తమ్ తన లేఖలో గుర్తు చేశారు. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచింది కనుక ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఒకేసారి రుణమాఫీ చెయ్యాలన్నారు.