*కరెంటు షాక్ తో గొర్రెలు మృతి. .
చిట్యాల జూలై2( జనంసాక్షి) కరెంటు షాక్ తో మూడు గొర్రెలు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ఎదుట మృతి చెందాయి. వివరాలలోకి వెళితే రోజువారీగా గొర్రెలు మంగళవారం ఖాళీ గా ఉన్న పంట చేన్లో మేత మేయుచుండగా, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బిగించి ఉన్న ల్యాండ్ ఎర్తింగ్ పాడవడం వల్ల విద్యుత్ షాక్తో గొర్రెలు మృతి చెందాయని బాధితులు ముష్కే ముండయ్య, బోళ్ళ శంకరయ్య అన్నారు.కాగా బాధితులకు తగిన న్యాయం చేయాలని ప్రజలు కోరారు.