కర్ణాటకను ముదురుతున్న సంక్షోభం

13మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు
బెంగళూర్‌,జనవరి29 (జనంసాక్షి) : కర్ణాటక బిజెపిలు గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సంక్షోభం ఇంకా వీడలేదు. తాజాగా 13మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి అసెంబ్లీ స్పీకర్‌ కెజి బోపయ్యకు సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మద్దతు తెలియజేస్తూ ఈ 13మంది ఎమ్మెల్యేలు గత కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారు. అయితే గవర్నర్‌ అందుబాటులో లేకపోవడాన్ని కనీసం అసెంబ్లీ కార్యదర్శి కూడా అందబాటులో లేకపోవడం రాజీనామాలు సమర్పించకుండా నేడు స్పీకర్‌కు సమర్పించారు. డిసెంబర్‌లో బిజెపి నుంచి బయటకు వచ్చిన యడ్యూరప్ప ఆనాటి నుంచి ప్రభుత్వానికి సంక్షోభాలు సృష్టిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి జగదీష్‌ షెట్టర్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారు. మరో ఐదుగురు శాసనసభ్యులు రాజీనామా బాటలో పయనించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా ఈ 13మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ ఉన్నందున వీరి రాజీనామాలను వెంటనే ఆమోదించడం కుదరదని స్పీకర్‌ బోపయ్య స్పష్టం చేశారు.