కర్ణాటకలో రైతన్న కన్నెర్ర

2

– బెంగుళూరులో భారీ నిరసన

బెంగుళూరు,మార్చి3(జనంసాక్షి): కర్నాటకలోని రైతులు కదం తొక్కారు. ఐదువేల ట్రాక్టర్లతో బెంగుళూరును ముట్టడించారు. కరువు జిల్లాలకు సాగునీరు, తాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ వైపు దూసుకువెళ్లారు. ప్రభుత్వంపై ఆక్రోశం వెల్లగక్కారు. 1500 అడుగుల లోతుకు బోరు వేసినా నీరు పడడంలేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కరువు సాయం కూడా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెక్‌బళ్లాపూర్‌, కోలా, తూమ్కూర్‌, బెంగుళూరు రూరల్‌ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలి వచ్చారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ట్రాక్టర్లను ఎక్కడికక్కడ ఆపేశారు. దీంతో తీవ్ర ఉద్రిత్త పరిస్థితులు నెలకొన్నాయి. బెంగుళూరు నగరం ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుంది. కిలోవిూటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కరువుబారిన పడి గత ఏడాది కర్నాటకలో వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.