కలల సాకారానికి కదిలిన ‘ఉద్యమ జర్నలిస్టు’
హక్కులు, ఆత్మగౌరవం కోసం ఏకతాటిపైకి..
బషీర్‌బాగ్ వేదికగా దశాబ్దకాల భావోద్వేగం
హైదరాబాద్, డిసెంబర్ 21 (జనంసాక్షి)
తెలంగాణ ఏర్పడిన దశాబ్దకాలం తర్వాత ఓ చారిత్రాత్మక సందర్భం ఆవిష్కృతమైంది. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వేదికగా గురువారం తెలంగాణ స్ఫూర్తిని చాటే సన్నివేశం ఎంతోమందిని కదిలించింది. ఒకవైపు కొత్త పాలన కొనసాగుతుండగా.. నిరాశ నిట్టూర్పూల్లో ఉన్న ‘కలం యోధుల’ నూతన గొంతుకగా ఊపిరి పోసుకుంది. అణిచివేత, నిర్బంధం బద్దలైందనే భావోద్వేగాన్ని పలికించిన సదరు వేదిక.. భవిష్యత్తు బాగు కోసం బాటలు వేసింది. అందరి దృష్టిని ఆకర్షించి.. పాలకులు, మేధావులు, పాత్రికేయుల్లో చర్చకు దారితీసింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, అమరుల ఆకాంక్షలను పుణికిపుచ్చుకుని ఉద్యమ జర్నలిస్టుల పరిరక్షణకు పూనుకుంది. గురువారం జరిగిన కార్యాచరణ సమావేశంలో ప్రముఖులు, పాత్రికేయులు సైతం ‘మేమున్నాం.. మీవెంట’ అంటూ గొంతుకలపడం అక్కడున్న అందరిలోనూ ఎనలేని ఉత్తేజాన్ని నింపింది.
నల్ల నేల బిడ్డల ధిక్కార స్వరం : మునీర్, సీనియర్ జర్నలిస్టు
తెలంగాణలోనే ఒక తిరుగుబాటు ఉంది. సింగరేణి నల్లబంగారం గనుల ప్రాంతంలో ఆ ధిక్కార ధోరణి నిప్పుకణమై రగులుతోంది. ఉద్యమకాలంలో జర్నలిస్టుల వెంట తిరిగిన గత పాలకులు.. తెలంగాణ సాధించిన తరువాత మాత్రం ఎవ్వరినీ పట్టించుకోలేదు. తెలంగాణ జర్నలిస్టులకు ఈ పాలకులు ఎన్నో గాయాలు చేశారు. అయితే నెత్తికి ఎక్కినవాణ్ని నేలకేసి కొట్టే చరిత్ర ఉన్నదని వారు తెలుసుకోలేకపోయారు. నాలుగున్నరేళ్ల జైలు జీవితం గడిపాను. ఏనాడూ ఎవరికీ లొంగిపోలేదు. నాకు 3 స్టెంట్లు పడ్డాయి. మూడున్నర లక్షల ఖర్చయింది. నా బిడ్డ, కొడుకులే చూసుకున్నారు. జర్నలిస్టుగా నాతో తిరిగిన గత పాలకులు ఒక్క రూపాయి కూడా విడుదల చేయించలేకపోయారు. మరి తెలంగాణ ఎవరిపరమైంది? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌కు నా విజ్ఞప్తి ఒక్కటే. ఎవరైనా జర్నలిస్టు ఏ కారణం చేత చనిపోయినా వారి కుటుంబానికి జీవితాంతం పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలి.
2014లోనే ఇలాంటి వేదిక కావాల్సింది : వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్
ఈ వేదిక ప్రజల గొంతుకగా మారాలి. మిగతా సంఘాల్లాగా మారకుండా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి. తెలంగాణ పేరు చెప్పి ఎంతోమంది లాభపడ్డారు. కానీ అసలైన ఉద్యమకారులు, జర్నలిస్టులకు అన్యాయం జరిగింది. ఇలాంటి వేదిక పదేండ్ల క్రితమే ఏర్పాటు కావాల్సింది. ఇప్పటికైనా కార్యరూపం దాల్చడం గొప్ప విషయం.
త్యాగాలు చేసినోళ్లను గుర్తించాలి : రహమాన్, ఉద్యమ జర్నలిస్టు వేదిక కన్వీనర్
ఈ వేదిక అందరి సంక్షేమం కోసం రూపుదిద్దుకుంది. ఉద్యమ జర్నలిస్టులు, అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తుంది. తెలంగాణ కోసం త్యాగాలు చేసినవారిని సర్కారు గుర్తించాలి. మిలియన్ మార్చ్, సాగరహారం వంటి సందర్భాల్లో కోదండరాం ముందుకు కదిలి వేలాది మందిలో చైతన్యం తెచ్చారు. అప్పుడు ఆయన పిలుపు ఓ ప్రభంజనం. తెలంగాణ సాధన కోసం ఏర్పడ్డ జేఏసీకి చైర్మన్‌గా ఉండటం అత్యంత చారిత్రాత్మకం. పదవులు కోసం ఎన్నో అవకాశాలు వచ్చినా తీసుకోకుండా యువత కోసమే ఆయన పనిచేశారు. ఇదే స్ఫూర్తితో ఉద్యమ జర్నలిస్టుల వేదిక కొనసాగుతుంది.
జర్నలిస్టులకు ధైర్యం వచ్చింది : టి.రమేశ్ బాబు, సీనియర్ జర్నలిస్టు
స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో ఏనాడూ తెలంగాణ జర్నలిస్టులు సమావేశం కాలేదు. అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులను ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎం.ఎం. రహమాన్ అందుకు పూనుకోవడం అభినందనీయం. నిజానికి ఇలాంటి ఆలోచన తెలంగాణలోని అందరు ఉద్యమ జర్నలిస్టుల్లోనూ ఉంది. అయితే ఆ వాతావరణాన్ని గ్రహించి ఈ సమావేశం నిర్వహించడం మిగతా జర్నలిస్టులు అందరిలోనూ ఎంతో ధైర్యం నింపుతోంది. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ దిశగా అడుగులు వేయాలి. ఉద్యమంలో పాల్గొన్న నికార్సయిన జర్నలిస్టులు ఇందుకోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
చేయాల్సింది చాలా ఉంది : పసునూరి రవీందర్, అద్దం ఎడిటర్
ఈ వేదిక మీద ఎన్నో పంచుకోవాలని ఉంది. మరో సందర్భంలో చాలా విషయాలు పంచుకుంటా. గత ప్రభుత్వం, దాని తాబేదార్లుగా ఉన్న మీడియా ఆర్గనైజేషన్లలో విపరీతమైన వివక్షను ఎదుర్కొన్నాను. నాకు ఎన్నో గుర్తింపులు వచ్చినా జర్నలిస్టుగా మాత్రం అక్కడ గుర్తింపు, గౌరవం పొందలేకపోయాను. ఈ సమావేశం చూస్తుంటే ఉద్యమ జర్నలిస్టులకు కనీస గుర్తింపు అయినా దొరుకుతుందన్న నమ్మకం కలుగుతోంది. కానీ ఇందుకోసం మనలాంటి జర్నలిస్టులు చేయాల్సింది చాలా ఉంది.
సినిమా తీస్తే వివక్ష : రఫీ, సినీ నటుడు, నిర్మాత
నేను జర్నలిస్టును కాను. కానీ తెలంగాణ కోసం నాలో ఉండే ఒక పెనుగులాట కారణంగా నన్ను అంతా జర్నలిస్టుగా గుర్తిస్తున్నారు. నాలోని కంటెంట్ నచ్చి చాలా మంది పత్రికాధిపతులు నా ఆర్టికల్స్ ప్రచురించారు. వారికి నా ధన్యవాదాలు. తెలంగాణ కోసం ఆరాటపడిన నేను తెలంగాణ ఇతివృత్తంతో సినిమా తీస్తే విపరీతమైన వివక్షకు గురిచేసి తీవ్రంగా నష్టపోయేలా చేశారు. ఇవి నా కన్నీళ్లు కావు. తెలంగాణ ప్రజల కన్నీళ్లు. తెలంగాణ తెచ్చుకొని బాగుపడ్డది ఎవరు? ఇప్పటివరకు తెలంగాణ జర్నలిస్టులంతా ఎదుర్కొన్న వివక్షను ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకల్లో మళ్లీ ఆనాటి తెగువ, ధైర్యం రావాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. జర్నలిస్టుల జీవితాలు బాగుపడతాయి.
మొదటి ఉద్యమంలో పాల్గొన్న : పీఎస్ రవీంద్ర, సీనియర్ జర్నలిస్ట్
ఆనాటి తెలంగాణ ఉద్యమంలో కేవలం విద్యార్థులే పాల్గొనగా అందులో నేనూ ఓ భాగస్వామినే. మలి దశ ఉద్యమంలో మాత్రం సకల జనులు ఒక్కటై తెలంగాణ సాధించుకున్నారు. కానీ ఫలితాలు మాత్రం ఇంతకాలం అందలేదు. వాటిని సాధించుకోవడానికి ఉద్యమ కాలం నాటి జర్నలిస్టులు ఏకం కావాల్సి ఉంది. ఈ వేదిక దానికి తోడ్పడుతుందని భావిస్తున్నా.
రాయడానికి హక్కు లేదా? : ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు
మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. రాజ్యాంగానికి విలువ లేకుండా పోయింది. రాయడానికి కూడా హక్కు లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? జర్నలిస్టులకు భద్రత లేని ఉద్యోగం అయ్యింది. కార్మిక చట్టాలు కూడా ఎక్కడా అమల్లో లేవు. ఉద్యమ జర్నలిస్టులంతా ఏకతాటిపైకి రావడం తెలంగాణ సమాజానికి అవశ్యం. ఇది రాబోయే తరాలకు ఒక దిక్సూచిగా నిలుస్తుందని ఆశిస్తున్నా.
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల కార్యాచరణ తీర్మానాలివీ.. :
1) తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సమూహాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలి. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుల స్థాయిగా గుర్తింపు నివాళి..
2) ఉద్యమ జర్నలిస్టులు ఎవరైనా దీర్ఘకాలిక (బీపీ, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్ వంటి తదితర) వ్యాధులతో బాధపడితే వారి ఇంటి వద్దకే వైద్య సదుపాయాలు, మందులు పంపిణీ చేయాలి.
3) ఉద్యమ జర్నలిస్టులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
4) ఉద్యమంలో పాల్గొని వివక్షకు గురై, అవమానాలు ఎదుర్కొని నిలబడిన జర్నలిస్టులకు ఇతర జర్నలిస్టులతో సంబంధం లేకుండా ఉద్యమ జర్నలిస్టులకు 300 గజాల ఇంటి స్థలం లేదా ఇల్లు ఇవ్వాలి.
5) ప్రస్తుతం హెల్త్ కార్డులు చెల్లుబాటు కావడం లేదు. దాని పరిమితి అత్యంత తక్కువగా ఉంది. అందువల్ల ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ కంపెనీలతో భాగస్వామ్యమై.. అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 20 లక్షల వరకు వైద్య సదుపాయాన్ని ఉచితంగా అందించాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ ఇన్సూరెన్స్, కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని కుటుంబ సభ్యులందరికీ అందించాలి.
6) ప్రభుత్వం ఈ సమూహాన్ని గుర్తించి, ప్రభుత్వం సంప్రదింపులు జరిపే అన్ని కమిటీల్లో ఉద్యమ జర్నలిస్టులకు ప్రాతినిథ్యం కల్పించాలి.
7) రిట్కెర్మెంట్ దశలో ఉన్న లేదా రిట్కెర్డ్ అయిన ప్రతి ఉద్యమ జర్నలిస్టుకూ నెలనెలా రూ.5వేల గౌరవ భృతి/పెన్షన్ ఇవ్వాలి.
8) ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణవాదాన్ని పుణికిపుచ్చుకుని టీజేఏసీతో కలిసి నడిచిన పత్రికలను ప్రోత్సహించాలి.
9) ఉద్యమ జర్నలిస్టులకు నామినేటెడ్ పోస్టుల్లో కూడా అవకాశం కల్పించాలి.
10) ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల పిల్లల ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు ప్రభుత్వ ప్రోత్సాహం అందించాలి.
11) ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చి ఆయా మీడియా సంస్థల్లో తగిన స్థానాల్లో ఉద్యోగ భద్రత ఉండేలా వ్యూహం రూపొందించాలి.
12) చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు భార్యా/తల్లికి వారి జీవితకాలం పెన్షన్ ఇవ్వాలి.
13) ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల ఉద్యమ పాత్రపై ప్రభుత్వం పుస్తకం తీసుకురావాలి.
14) కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారైనా ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో సమావేశం జరపాలి. అందులో తెలంగాణ పత్రికలకు ప్రముఖ స్థానం ఇవ్వాలి.
15) తెలంగాణ ఉద్యమకారులపై గత సమైక్య ప్రభుత్వాలు పెట్టిన కేసులతో పాటు తెలంగాణ వచ్చిన తరువాత ప్రశ్నించిన గొంతుకలపై పెట్టిన అన్ని కేసులూ ఎత్తివేయాలి.
16) తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుల్కెన 1200 మంది చరిత్ర అంతకుముందు అమరుల్కెన 369 మంది చరిత్రను గ్రంథస్థం చేయాలి.