కలిసికట్టుగా ముందుకు నడుద్దాం టిడిపి నేతల తీర్మానం
శ్రీకాకుళం, జూలై 7 : వచ్చే రోజుల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని తెలుగుదేశం పార్టీ నేతలు తీర్మానించుకున్నారు. జిల్లాకు చెందిన టిడిపి అగ్రనేతలంతా స్థానిక ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, మాజీ మంత్రులు కళా వెంకటరావు, జి.అప్పలసూర్యనారాయణ, ఎమ్మెల్యే సాయిరాజు, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస షుగర్ ప్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని, వంశధార కరకట్టల నిర్మాణం, తోటపల్లి ప్రాజెక్టుకు నిధులు విడుదలకు పోరాడాలని నిర్ణయించారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టిడిపి నాయకులు రవికుమార్, వెంకటరమణ, అప్పలనాయుడు, ఎల్‌ఎల్‌నాయుడు, సిహెచ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.