కశ్మీర్‌లో పోలీస్‌ స్టేషన్లపై మిలిటెంట్ల దాడి

4

5గురు మృతి

శ్రీనగర్‌,మార్చి20(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు.  కథువా జిల్లా రాజ్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డాడు. స్టేషన్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు పలువురిని నిర్భందించి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో  ఐదుగురు మృతి చెందారు. ఒక పౌరుడు, సీఆర్పీఎఫ్‌ జవానుతో పాటు, ఇద్దరు పోలీసులు మృతి చెందారు. కాగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు.  ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు తీవ్రంగా కొనసాగాయి. రాజ్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉగ్రవాదులు బాంబు పేల్చినట్లు సమాచారం. ఇదిలావుంటే  కథువా జిల్లా రాజ్‌భాగ్‌ పోలీస్‌ స్టేషన్లలో పోలీసుల ఆపరేషన్‌ ముగిసింది. ఈ ఉదయం పోలీసుల దుస్తులతో పీఎస్‌లోకి ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారు. ఉగ్రవాదులు పీఎస్‌లోకి చొరబడి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు, ఒక పౌరుడు ఉన్నారు. అనంతరం ఉగ్రవాదులను పోలీసులు పీఎస్‌లోనే నిర్బంధించారు. సుమారు మూడు గంటల పాటు భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల ఆపరేషన్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. దీంతో కాశ్మీర్‌లో పోలీసులు, భద్రతా సిబ్బంది అలర్ట్‌ అయ్యారు. అన్ని పోలీస్‌ స్టేషన్లను అప్రమత్తం చేశారు. జమ్మూకశ్మీర్‌ కథూవా జిల్లాలోని రాజ్‌భాగ్‌ పీఎస్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనపై కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లోక్‌సభలో మాట్లాడారు. ఉగ్రవాదుల దాడి దురదృష్టకరమని ¬ంమంత్రి అన్నారు. రాజ్‌భాగ్‌ పోలీస్‌ స్టేషన్‌పై దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ఇద్దరు ఉగ్రవాదులను కూడా పోలీసులు కాల్చిచంపారు. జమ్మూకశ్మీర్‌ కథూవా జిల్లా రాజ్‌భాగ్‌ పోలీస్‌ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడి చేయడం దురదృష్టకరమని లోక్‌సభలో  కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున్‌ఖర్గే పేర్కొన్నారు. లోక్‌సభలో ఖర్గే మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడులు మళ్లీమళ్లీ పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఉగ్రవాద దాడిని తాము రాజకీయం చేయదల్చుకోలేదని స్పష్టం చేశారు. ఉగ్ర దాడులు పునరావృతం కాకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఖర్గే సూచించారు.