కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడాలి

1
– అస్సాం ప్రచార సభలో మోదీ

అసోం,మార్చి27(జనంసాక్షి):కాంగ్రెస్‌ నిర్మూలనతోనే అసోం అభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అసోం రంగాపరలో ఎన్నికల సభలో మోడీ మాట్లాడుతూ.. 15 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనకు అసోం వెనుకబాటుతనమే నిదర్శనమన్నారు. సీఎం తరుణ్‌ గోగోయ్‌ తమకు వ్యతిరేకంగా మాత్రమే పోరాటం చేస్తుంటే.. తాము పేదరికం, అవినీతిపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ 15 ఏళ్ల పాలనలో ఏ ఒక్క హావిూని నెరవేర్చలేదు అని గుర్తు చేశారు. అసోం ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీని గెలిపిస్తే అసోంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

అక్కడ కుస్తీలు పడుతూ.. ఇక్కడ చేతులు కలిపారు’

అంతకు ముందు పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు.కేరళలో  అధికారం కోసం కుస్తీలు పడుతున్న కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు

పశ్చిమబెంగాల్‌లో రాజకీయ లబ్ది కోసం చేతులు కలిపాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆదివారం  ఒకప్పుడు పరిశ్రమలకు రాజధానిగా ఉన్న బెంగాల్‌ కమ్యూనిస్టుల

పాలనలో వెనుకబడగా, తృణమాల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పరిస్థితి మరింత దిగజారిందని డిందని మోదీ విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడ్డాయని, బాంబులు తయారు చేసే పరిశ్రమ ఒక్కటే నడుస్తోందని ఆరోపించారు. ముద్ర పథకాన్ని ముందుగా ప్రవేశపెట్టినట్టయితే శారదా కుంభకోణం జరిగిఉండేది కాదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ కుంభకోణం గురించి అయినా విన్నారా మోదీ అన్నారు.

అస్సాం ప్రభుత్వం ప్రజల నమ్మకాలను వమ్ముచేసింది

ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాలను తరుణ్‌ గొగోయ్‌ ప్రభుత్వం వమ్ముచేసిందని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.ఒకప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అస్సాం ఉండేదని.. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. పదిహేనేళ్ల కాలంలో కేంద్రం నుంచి ఎన్నో నిధులు చేరాయని.. అవన్నీ ఎలా వినియోగించారని ప్రశ్నించారు. ఎన్ని నిధులు వచ్చినా.. అభివృద్ధి మాత్రం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో భాజపా కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాంలో ఏప్రిల్‌ 4, 11వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 126 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో భాజపా 91 నియోజకవర్గాల్లో పోటీచేస్తుంది. మిగతా స్థానాల్లో తమ కూటమి పార్టీలైన అస్సాం గణపరిషద్‌, బోడోల్యాండ్‌ పీపుల్స్‌ పార్టీ, మరో రెండు చిన్న పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. అస్సాంలో ప్రచారం అనంతరం మోదీ పశ్చిమ్‌బంగా వెళ్లనున్నారు.