కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి  మహిళాలా  మార్క్ ఉండాలి- జనగామ జిల్లా మహిళ కాంగ్రెస్ ఇంచార్జ్  ఎ.దుర్గరాణీ   

                           జనగామ (జనం సాక్షి )ఆగస్ట్3: టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య  మరియు మహిళ కాంగ్రెస్ రాష్ట్ర  అధ్యక్షురాలు సునీతరావు  ఆదేశాల మేరకు జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జనగామ జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇందిరా  అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశనికి జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెంచారపు శ్రీనివాస్ రెడ్డి  రాష్ట్రమహిళ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్  జనగామ జిల్లా మహిళ కాంగ్రెస్ ఇంచార్జ్  ఎ.దుర్గరాణీ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ కార్యదర్శి బంగారు  పద్మ పాల్గొని ప్రసంగించారు జనగామ జిల్లా వ్యాప్తంగా  రానున్న రోజుల్లో  మహిళ  కాంగ్రెస్ బలోపేతం కొరకు పాటుపడాలని  కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిత్యవసర ధరల మీద గ్యాస్ ధరల మీద పోరాటాలు చేయాలి  మహిళలను కట్టేలపోయి కాలానికి తీసుకు పోయే విధంగా గ్యాస్ ధరలు పెంచిన  బిజెపి ప్రభుత్వం   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో  నిరంకుశపాలనను ప్రజలకు తెలిసే విధంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  సిద్ధేంకి గ్రామ సర్పంచ్ సుంకరి నిర్మల జనగామ మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని జయ బచ్చనపేట మండల అధ్యక్షురాలు వేణువందన స్టేషన్ గణపురం మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు జోష్ణ  జాఫర్ గడ్ మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీవాణి రఘునాథ్ పల్లి గ్రామ ఎంపీటిసి పేర్ని ఉషారవి మాజీ ఎంపీటిసి వడ్లకొండ నామాల విమల యశ్వంతపూర్  గ్రామ మహిళ వైస్ ప్రెసిడెంట్ బొట్ల రజిత సీనియర్ మహిళ నాయకులు గాడిపెల్లి సక్కుబాయి లీల కృష్ణవేణి యమాకి లింగమ్మ సుంకరి అనసూర్య కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.