కామారెడ్డి, బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ల ప్రమాణ స్వీకారం ..
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్21 (జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా కేంద్రం లొని సత్య కన్వెన్షన్ లో బుధవారం కామారెడ్డి, బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ల ప్రమాణ స్వీకారం లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. సందర్బంగా అయన మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ చైర్మన్ లు పాలక వర్గ సభ్యులు రైతులను మదిలొ ఉంచుకొవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం 28 రాష్ట్ర లకు అదర్షం అన్నారు. కెంద్ర ప్రభుత్వం పని తీరుపై ప్రశ్నించారు.మన తెలుగు మహిళ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ కు వెళ్లి రేషన్ షాపుకు వెళ్లి తన ఫోటో ఎందుకు పెట్టలేదు అని అడిగిందని,ప్రతి వస్తువుకు అగ్గిపెట్టె నుండి టాక్స్ కడుతున్న ప్రజల ఫొటో పెట్టేలా, సిగ్గు లేకుండా నా ఫోటో పెట్టవా అని అడుగుతావ ప్రశ్నించారు.గుజరాత్ రాష్ట్రంలో 9 గంటల కరెంట్ ఇస్తే, తెలంగాణా లో 24 గంటల కరెంట్ ఇస్తుందన్నారు.వృద్దులకు 2016 పెన్షన్ కెసిఆర్ ఇస్తున్నారు, మోడీ మాత్రం 600 ఇస్తున్నారు. ఇది నిజం కాదా అని బిజేపి ప్రభుత్యం ను ప్రశ్నించారు.తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేదన్నారు.