కార్పొరేషన్‌లో అన్ని డివిజన్లలో పోటీ బిజెపి నగరాధ్యక్షులు ఎన్‌వి సాయిబాబా

కాకినాడ, జూలై 13,(: కాకినాడ కార్పొరేషన్‌కు ఈసారి జరగబోయే ఎన్నికల్లో మొత్తం యాభై డివిజన్లకు పోటీ చేయడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నామని నగర బిజెపి అధ్యక్షుడు ఎన్‌వి సాయిబాబా తెలియజేశారు. నగరంలో బిజెపి ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్దితో పోరాటాలు చేస్తుందని, నగరంలో ఇప్పటికే అన్ని డివిజన్లలో కమిటీలు వేశామని చెప్పారు.బిజెపిని నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా పటిష్ట పరుస్తున్నామని చెప్పారు. నగరంలో యాభై డివిజన్లలో కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు ప్రతి డివిజన్‌లో ఐదుగురు చొప్పున కార్పొరేటర్‌ పోటీ అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నామని, ఇప్పటి నుండే ఆయా డివిజన్లలో ప్రజాసమస్యలు గురించి అధికారులకు చేరవేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. చేసే కృషిని చూసి వారిలో నాణ్యమైన అభ్యర్ధిని ఎంపిక చేస్తామని ఈ ఐదుగురు తొలుతగా తమలో ఎవరికి సీటు వచ్చినా మిగతా వారికి సహకరిస్తామని ఒప్పంద పత్రాలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఎన్నికల వల్ల బిజెపి నగరంలో మరింత పటిష్టంగా ప్రజల్లోకి వెళ్లగలదనే ధీమాను వ్యక్తం చేశారు.