కాలం లేదు సరే.. పండిన పంటకు ధరెందుకు లేదు?

4

– రైతుల పక్షాన పోరాడుతాం

– తొందరపడి ఆత్మహత్యలొద్దు

కోరుట్ల టౌన్‌, మార్చి19(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం దుర్భరంగా ఉన్న రైతుల పరిస్థితికి ప్రభుత్వం కాలం లేదని సమాధానం చెబుతుందని, మరి ఈ కరువు కాలంలోనూ పండిన అరకొర పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరెందుకు కల్పించలేకపోతుందని చెప్పాలని జేఏసీ చైర్మన్‌ ప్రాఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు.శనివారం ఆయన కోరుట్ల నియోజవర్గంలో పర్యటించి కరువు మండలాలలో పర్యటించి కరువుపై అధ్యయం చేశారు. ఆయా ప్రాంతాలలోని పంటలను ఆయన పరిశీలించారు. అక్కడ రైతులను ప్రస్తుత పరిస్థితుల గురించి వాకాబు చేశారు. కోరుట్ల నియోజకవర్గాన్ని రువు ప్రాంతంగా ప్రకటించాలని ఈ సందర్బంగా ప్రొ|| కొదండరాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆనంతరం కోరుట్ల ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బోర్లు తవ్వించిన చుక్క నీరురాక ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టడుతున్నారని, పశువులు మేయడం కోసం మేత లేక దుర్భర పరిస్ధితులు ఎదుర్కోంటున్నాయన్నారు.వరి, మామిడి, చెఱకు రైతులను ప్రభుత్వం అదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ప్రాంతంలో ప్రధాన పంటలైన మామిడి, వరి, చెఱుకు పంటలు సాగునీరు లేక ఎండిపోతున్నాయని, రైతులను ప్రభుత్వం అదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కెర రాజు, జిల్లా అధ్యక్షులు ప్రభాకర్‌రావు, జక్కుల వెంకటేశ్వర్లు, ద్యాగాల సారయ్య, లక్ష్మారెడ్డి, ప్రభాకరచారీ, సిపిఐ నాయకులు చింత భూమేశ్వర్‌ తదితరులు పాల్గన్నారు.