కుప్పకూలిన మరో ఫ్రాన్స్‌ విమానం

C
-సిబ్బందితో సహా 148 మంది మృతి

పారిస్‌,మార్చి 24 (జనంసాక్షి):  మరో విమానం కుప్పకూలింది.  ఫ్రాన్స్‌లోని దక్షిణ భాగంలో ఎయిర్‌బస్‌ 320 విమానం కూలిపోయినట్టు తెలిసింది. విమానంలో 142 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ కూడా ధృవకీరించింది. ఇందులో ఎవరు కూడా బతికే చాన్స్‌ లేదని తెలిపింది.  జర్మనీ వింగ్స్‌ విమానయానసంస్థకు చెందిన 4యూ9525 విమానం స్పెయిన్‌లోని బార్సిలోనా నుంచి జర్మనీలోని దస్సెల్‌డర్ఫ్‌కు ప్రయాణిస్తోంది.  ఫ్రాన్స్‌లోని ఆల్ప్‌ పర్వతప్రాంతంలోని డిగ్నె లెస్‌ బైన్స్‌ ప్రాంతంలో విమానంతో రాడార్‌ సంబంధాలు తెగిపోయాయి. విమానంలో  142 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు విమానసిబ్బంది వున్నారు. ఎయిర్‌ బస్‌ ఎ 320 కూలిపోవడంతో అందులోని ప్రయాణికులు అందరూ మరణించి ఉంటారని భయపడుతున్నారు. ప్రమాద కారణాలు తెలయవలసి ఉంది. జర్మని కి చెందిన వింగ్స్‌ కంపెనీ విమానంగా చెబుతున్నారు.  ఫ్రాన్సులోని దక్షిణ ఆల్ప్స్‌ పర్వతాల్లో ఇది కుప్పకూలింది. ఈ విషయాన్ని జర్మనీ పౌర విమానయాన సంస్థ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం భారత కాలమానం ప్రకారం 3.30 గంటల సమయంలో సంభవించింది. ఇంజన్‌ లో లోపం లేదా మంట వల్ల విమానం కూలి ఉండొచ్చని చెబుతున్నారు. లుఫ్తాన్స ఎయిర్లైన్స్‌ అనుబంధ సంస్థ జర్మన్వింగ్స్‌ విమానయాన సంస్థకు చెందిన జీడబ్ల్యుఐ18జి విమానంలో ఇద్దరు పైలట్లు, నలుగురు స్టివార్డులు ఉన్నట్లు తెలిపారు. అది ప్రస్తుతం రాడార్‌ పరిధిలో ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు. ఈ విమాన ప్రమాదంలో ఏ ఒక్కరూ ఏ ఒక్కరూ మిగిలే అవకాశం లేదని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ¬లండ్‌ తెలిపారు. విమాన శిథిలాలు కొంతవరకు కనిపించినట్లు ఫ్రెంచి ¬ంశాఖ తెలిపింది. ఓ గ్రామ పరిధిలో విమాన టైరు కనిపించిందని చెబుతున్నారు. ఏమైనా శకలాల కోసం సహాయక సిబ్బంది గాలింపునకు దిగారు.