కెబినెట్‌ కీలక నిర్ణయాలు

5

– జలమండలికి 1900 కోట్లు, మిషన్‌ భగీరథకు 1900 కోట్లు

హైదరాబాద్‌,మార్చి6(జనంసాక్షి): కెబినెట్‌ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం రెండు గంటలకుపైగా ఈ సమావేశం జరిగింది. జలమండలికి రూ. 1900 కోట్లు, మిషన్‌ భగీరథకు రూ. 1900 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రెండు గంటలకుపైగా ఈ సమావేశం జరిగింది. సమావేశంలో బడ్జెట్‌ ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చించారు. జలమండలి, మిషన్‌ భగీరథకు నిధుల కేటాయింపుపై చర్చించారు. జలమండలికి రూ. 1900 కోట్లు, మిషన్‌ భగీరథకు రూ. 1900 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నాబార్డ్‌ నుంచి రుణం తీసుకోవడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. టీఎస్‌ఐఐసీకి 50 ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.టీఎస్‌ఐఐసీకి 50 ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లో లక్ష సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆమోదంతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఖైదీల విడుదలకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మున్సిపల్‌ చట్టాలపై జారీ చేసిన ఆర్డినెన్స్‌ లపై బిల్లు పెట్టాలని నిర్ణయించింది. దాంతో పాటు ఆర్టీసీ తీసుకునే రూ.500కోట్ల రుణానికి ప్రభుత్వం హావిూగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌కు 3ఎకరాల స్థలం ఇచ్చే అంశంపై చర్చించారు. ఉన్నత విద్యాచట్టాన్ని రాష్ట్రానికి అన్వయించుకునేందుకు అవసరమైన సవరణలకు సీఎం నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 10న ఉభయసభల్లో జరిగే గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం తెలిపారు.