కేంద్రంలో అధికారంలో ఉండి భిక్షాటన నా నవ్విపోదురు గాక నాకేమి సిగ్గు
మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్
శివ్వంపేట సెప్టెంబర్ 28 జనంసాక్షి :
కేంద్రంలో అధికారంలో ఉండి ఒక్క అభివృద్ది పనికి కూడా నిధులు తీసుకురాలేని బీజేపి నాయకులు భిక్షాటన చేయడం నవ్విపోదురు గాక నాకేమి సిగ్గు అన్నట్లుగా ఉందని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ అన్నారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ప్రభుత్వాలలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లన్ని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది చేసిన సంగతిని బీజేపీ పార్టీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులూ ఉన్నాగాని, కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా గానీ ఏఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా పార్టీలకు అతీతంగా, ఎవ్వరి ప్రమేయం లేకుండా ప్రతి ఇంటింటికీ సంక్షేమ పలాలను అందిస్తున్న ఘనత సీఎం కేసిఆర్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సహకారంతో నర్సాపూర్ ఎమ్మేల్యే మదన్ రెడ్డి నియోజవర్గంలోని రోడ్లన్నిటికి 32 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించిన సంగతి బీజేపీ నాయకులకు తెలువదా అని మండిపడ్డారు. వర్షాల కారణంగా రోడ్ల పనులు కొంత ఆలస్యమయ్యయని, వర్షాలలో రోడ్లు వేస్తే ఉంటాయా అని ఆయన ప్రశ్నించారు. దసరా పండుగ తర్వాత రోడ్ల పనులకు రాష్ట్ర మంత్రి హరీష్ రావు,ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి,మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బిక్షాటన చేస్తే ప్రజలు హర్షించేవారని, ఇదే బిక్షాటన యాత్రను ఢిల్లీ దాకా కొనసాగిస్తే బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తుండేనేమోనని ఆయన అన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుండి నిధులు మంజూరు చేయించి ఒక్క రోడ్డునైనా బాగు చేయించి ప్రజల ముందుకు వెళ్తే ప్రజలు నమ్ముతారని ఆయన సూచించారు. బీజేపీ పార్టీ నాయకుల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు.