కేంద్రంలో బడా పెట్టుబడిదారుల సర్కార్‌

C

 

CA

CC

CBరైతుల భూములు లాగి అదానీ,అంబానీలకిచ్చేందుకు కుట్ర

రాష్ట్రంలో మినీ మోదీ పాలన

యేడాది పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

ఆదిలాబాద్‌, మే 15(జనంసాక్షి) : బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విరుచకపడ్డారు. కేంద్రంలో బడాపెట్టుబడిదారుల సర్కార్‌ కొలువుదీరిందని విమర్శించారు. అక్కడ మోడీ..ఇక్కడ మినీ మోడీ అంటూ రాహుల్‌ తనదైన శైలిలో విమర్శలు సంధించారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో పాదయాత్ర చేసిన రాహుల్‌ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం వడ్యాలలో నిర్వహించిన బహిరంగసభలో రాహుల్‌ మాట్లాడారు. అచ్చే దిన్‌ అన్నారు..కానీ అచ్చే దిన్‌ అనేది వారికి మాత్రమే వచ్చాయని, చైనా..కెనాడా..ఇలా ప్రపంచం మొత్తం తిరుగుతున్నారని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పది లక్షల సూట్‌ ఎవరైనా వేసుకున్నారా ? కానీ మోడీ మాత్రం వేసుకున్నారంటూ ఎద్దేవా చేశారు. యూపీఏ ప్రభుత్వ హాయంలో భూమి విూద రైతుకు హక్కు ఉండాలని, భూముల రేట్లు పెరిగినప్పుడు దాని లాభం ఆ రైతు కుటుంబ సభ్యులకు అందాలని కాంగ్రెస్‌ యోచించిందన్నారు. తాము తెచ్చిన భూ సేకరణ బిల్లు ద్వారా రైతుకు మంచి రేటు వస్తుందని, ఈ చట్టంలో మూడు ప్రత్యేకమైన అంశాలున్నాయన్నారు. రైతు నుండి భూముల తీసుకొంటే వారిని అడిగి తీసుకోవాలని చట్టంలో ఉందని, అందుకు రైతుల అంగీకారం ఉండాల్సిందేనని అన్నారు. తీసుకున్న భూముల్లో ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క పని మొదలు కాకపోతే తిరిగి రైతులకు ఇవ్వాల్సిందేనని తాము గతంలో చట్టంలో పేర్కొన్నామన్నారు. ఎవరు భూమి తీసుకున్నా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, ఆరు నెలల కాలంలో ఒక రిపోర్టు తయారు చేయాలని. ఇందుకోసం సోషల్‌ ఆడిట్‌ ఉండాలని పేర్కొన్నామని రాహుల్‌ గుర్తుచేశారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం వచ్చి కీలకమైన ఆ మూడు అంశాలను తొలగించింధని, అడకుండానే భూములు తీసుకుంటారని, సోషల్‌ ఆడిట్‌ జరక్కుండానే, ఐదు సంవత్సరాలు..పది సంవత్సరాలు..పదిహేను సంవత్సరాలు..యాభై సంవత్సరాలు పని జరగకపోయినా భూముల తిరిగి ఇవ్వరని, ఈ బిల్లును తొందరగా పాస్‌ చేయించుకోవాలనే యోచనలో బీజేపీ ఉందన్నారు.  దేశం, రాష్ట్రాల దగ్గర చాలా ఖాళీ భూములున్నాయి. వీటిని ఉపయోగించుకోకుండా రైతుల దగ్గరి నుండి భూములు కావాలంటున్నారు. భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటారు. భూములు లేకపోవడం వల్ల పరిశ్రమలు ఆగిపోయాయని అన్నారు. దీనికోసం తాము ఇతర సంబంధిత అధికారులను అడిగితే 8 శాతం మాత్రమే ఆగిపోయాయని వారు చెప్తున్నారని. భూముల కారణంగా ప్రాజెక్టులు ఆగలేదని, ఇతర కారణాల వల్ల ఆగాయని వారు చెప్తున్నారని రాహుల్‌ అన్నారు.

పంట నష్టం జరిగితే అక్కడ మోడీ..ఇక్కడ మినీ మోడీ చూడడం లేదని రాహుల్‌ థాటు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ ఒక్క మాట కూడ మాట్లాడడం లేదని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఎందుకు పరామర్శిస్తున్నారు అని వారు అడుగుతున్నారు. కానీ అక్కడ మోడీ..ఇక్కడ మినీ మోడీ వారిని పరామర్శిస్తే తనకు రావాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. రైతులు..రైతు కూలీల కోసం కోట్లాడుతామని, ఎంఎస్పీ..ఇతర అన్ని విషయాల్లో పోరాడుతామని. పార్లమెంట్‌ లో..వీధుల్లో పోరాటం చేస్తామని. పరిశ్రమలకు వ్యతిరేకం కాదని అయితే. రైతుల భూములు మాత్రం లాక్కోవద్దని చెబుతున్నామని రాహుల్‌ ప్రసంగించారు. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. మహారాష్ట్రలో కరువు ఏర్పడినప్పుడు యూపీఏ ప్రభుత్వం సహాయం చేయడం జరిగింది. బుందేల్‌ ఖండ్‌ లో కరువు ఏర్పడితే అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. మద్దతు ధర పెంచుతూ వచ్చాం. రైతుకు 70వేల కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. కాంగ్రెస్‌ హాయాంలో 10 సంవత్సరాల్లో 8లక్షల కోట్ల రూపాయల లోన్‌ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఆరున్నర కోట్ల రైతులకు లాభం జరిగింది”.అని రాహుల్‌ పేర్కొన్నారు.

ఎన్నికలయ్యాక ప్రజలకు మంచిరోజులు వస్తాయని నరేంద్రమోదీ చెప్పారని… ఆ రోజులు మోదీకి వచ్చాయి గానీ ప్రజలకు రాలేదని రాహుల్‌గాంధీ విమర్శించారు. ఆదిలాబాద్‌లో జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో భాగంగా వడ్యాల్‌లో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తనతో పాటు పాదయాత్రలో పాల్గొన్న అందరికీ రాహుల్‌ ధన్యవాదాలు తెలిపారు. ఆయన ప్రసంగిస్తూ… మోదీ, కేసీఆర్‌పై విమర్శనాస్‌ాలు సంధించారు. మోదీ ప్రధాని అయ్యాక రూ.10 లక్షల విలువైన సూటు వేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. దిల్లీలో ఒక మోదీ, తెలంగాణలో మరో మోదీ ఉన్నారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. ఎన్టీయే, కేసీఆర్‌ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? అని రాహుల్‌ ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న రైతులను మోదీ, కేసీఆర్‌ పరామర్శించలేదని.. బాధిత రైతు కుటుంబాలను మోదీ, మినీ మోదీలు అదుకుంటే తాను వచ్చేవాణ్ని కాదన్నారు. పారిశ్రామిక వేత్తలు, రైతులు కలిస్తేనే దేశం ముందుకు వెళ్తుందని… కానీ ఈ ప్రభుత్వాలు రైతుల పొట్టకొట్టి పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నాయని మండిపడ్డారు.

దేశాభివృద్ధికి రైతే మూలమని రాహుల్‌గాంధీ కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతుల కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. నీరు, విద్యుత్‌, ఎరువులు లేకుంటే రైతులు ఏ పనీ చేయలేరని.. రైతులకు సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రైతులు, కూలీలు, జీవితాంతం ఎండల్లోనే పనిచేస్తుంటారని.. వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. మహారాష్ట్రలో కరవు సమయంలో యూపీఏ ప్రభుత్వం వారిని గుర్తుచేశారు.

రూ.70వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే

రైతులకు రూ.70వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని రాహుల్‌గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో రూ.8లక్షల కోట్ల రుణాలు రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. పట్టణాల సమీపంలో ఉన్న భూముల ధరలు పెరుగుతూ వస్తున్నాయని.. గతంలో వేలల్లో ఉన్న భూముల ధరలు… ఇప్పుడు లక్షల్లోకి చేరాయన్నారు. భూముల ధరలు పెరిగితే వాటి ఫలాలు కూడా రైతులకు దక్కాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాము భూసేకరణ చట్టం తెచ్చామని.. దీని ద్వారా రైతులకు అధిక ధరలు లభించేవన్నారు. తాము తెచ్చిన భూసేకరణ చట్టం ద్వారా భూములు తీసుకునేందుకు రైతుల అనుమతి తప్పనిసరని రాహుల్‌ తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన వెంటనే భూసేకరణ చట్టం రూపురేఖలే మార్చేసిందని విమర్శించారు.

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదిలాబాద్‌ జిల్లా కొరిటికల్‌ నుంచి చేపట్టిన కిసాన్‌ సందేశ్‌ యాత్రఅa కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా పాల్గొన్నారు. కొరిటికల్‌లో రైతు వెల్మ రాజేశ్వర్‌ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం లక్ష్మణ్‌చాందా, పొట్టపల్లి, రాచపూర్‌ మీదుగా వడ్యాల్‌ వరకు 15 కి.మీ మేర పాదయాత్ర కొనసాగింది. లక్ష్మణ్‌చందాలో బోండ్ల లింగన్న, అస్మన్న కుటుంబాలను రాహుల్‌ పరామర్శించారు. సాయంత్రం 4గంటలకు వడ్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రాహుల్‌ ప్రసంగిస్తారు. కాంగ్రెస్‌ సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్‌తో పాటు, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.