కేటీఆర్‌ కు ఆస్ట్రేలియా ఆహ్వానం

5
హైదరాబాద్‌,మార్చి 19 (జనంసాక్షి):

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. సిబిట్‌ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2015కు రావాలని ఆహ్వానించింది. మే 5 నుంచి 7 వరకు సిడ్నీలో ఈ వాణిజ్య ప్రదర్శన జరగనున్నది. ఇందులో 30 దేశాల నుంచి 450కి పైగా ఐటీ కంపెనీలు పాల్గొననున్నాయి. మన దగ్గర ఐటీ వెంచర్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆస్ట్రేలియా ఆసక్తి చూపుతోంది. విద్యా, పాడి రంగాల్లో భాగస్వామ్యానికి సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. నీటి వనరుల నిర్వహణకు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తోంది.