కేసీఆర్‌కు అస్వస్థత
హైదరాబాద్,ఏప్రిల్ 16(జనంసాక్షి):తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సీఎం ఆరోగ్యాన్ని వైద్యులు పరీక్షించారు. మరో రెండు, మూడు రోజులు పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్‌కు వైద్యులు సూచించారు. దీంతో ముఖ్యమంత్రి మూడు రోజులపాటు తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దుచేసుకోవాల్సి వచ్చింది. వైద్యుల సూచన మేరకు మూడు రోజుల కార్యక్రమాలను సీఎం రద్దు చేసుకున్నారు