కేసీఆర్ బస్తీబాట
శ్రీఐడీహెచ్ కాలనీలో సీఎం పాదయాత్ర
హైదరాబాద్,ఏప్రిల్30(జనంసాక్షి):
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను సికింద్రాబాద్‌లోని బోయిగూడ ఐడీహెచ్ కాలనీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. నమూనా నిర్మాణాన్ని పరిశీలించిన కేసీఆర్ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఐడీహెచ్ కాలనీలో శంకుస్థాపన చేసిన సీఎం 6నెలల్లోగా నిర్మాణ పనులు పూర్తిచేస్తామని హావిూ ఇచ్చారు. ఆ మేరకు ఈ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. అనుకున్న మేరకు ఇళ్ల నిర్మాణం జరుగుతందా అని ఆరా తీసారు. బుధవారం సిఎం గృహనిర్మాణంపై సవిూక్షించి నగరంలో పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి భూ సవిూకరణకు ఆదేశించారు. ఇంతలోనే ఈ నిర్మాణాలను పరిశీలించడంతో నగరవాసుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని సిఎం కెసిఆర్ అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకమైనదిగా సీఎం భావిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. జూన్ 2 నాటికి ఐడీహెచ్ కాలనీలో నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు అందిస్తామని తెలిపారు. బంగారు తెలంగాణ అంటే పేదల కళ్లలో ఆనందం చూడడమే అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. రెండు పడక గదుల ఇళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. రాష్ట్రంలోనే ఉత్తమ నమూనాగా ఐడీహెచ్ కాలనీ ఉంటుంది. అక్టోబర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాలనీ నిర్మాణానికి పునాది వేశారు. జనవరిలో పనులు ప్రారంభ మయ్యాయి. జూన్ రెండో తేదీ వరకు నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పేదలకు ఇళ్లు కట్టించే పని లో భాగంగా భూ సేకరణ జరిపిన తర్వాత ఆ భూమిని స్వాధీ నం చేసుకుని రెండు లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు. నిరుపేదల ఇండ్లంటే ఎక్కడో విసిరేసినట్టు దూరంగా ఉండొద్దని.. వారి ఇండ్లు నగరం మధ్యలోనే ఉండా లని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో పేదల గృహనిర్మాణాలపై సవిూక్షను నిర్వహించారు. ఈ సవిూక్షలో సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. హైదరాబాద్ లో దాదాపు రెండు లక్షల మంది నిరుపేదలకు ఇండ్లు లేవని.. ఇండ్లు లేని నిరుపేదలకు 2వేల ఎకరాల్లో పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో బహుళ అంతస్థుల భవనాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్లు కటించి ఇస్తమని సీఎం పునరుద్ఘాటించారు. వీలైతే బంజారా హిల్స్‌లోనే పేదలకు ఇండ్లు కట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ధనవంతుల విలాసాలు, వినోదాలు, కాలక్షేపాలు, అలవాట్లకోసం వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారని… నిలువ నీడలేని నిరుపేదలకు ఇండ్లు కట్టించడానికి విలువైన స్థలాలను వినియోగిస్తే తప్పేంటని అన్నారు. ఈ దిశగా ఆలోచించి పేదల ఇంటి నిర్మాణం కోసం స్థలాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. మరునాడే సిఎం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించడంతో స్థానిక బస్తీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దానం కూతురి పెళ్లికి సిఎం కెసిఆర్
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కూతురు వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ నూతన దంపతులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ వివాహ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటల రాజేందర్,తలసాని శ్రీనివాస్ యాదవ్ ,ప్రముఖ సినీ నటులు చిరంజీవి, రాజేందప్రసాద్, మోహన్ బాబు బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాలతోపాటు సినీ రంగ ప్రముఖులు,రాజకీయ నాయకులు హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. దానం నాగేందర్ కుమార్తె వివాహానికి ముందు జరిగే సంగీత్ కార్యక్రమానికి ముంబై నుంచి కొందరు ప్రముఖ నటీ,నటులు వచ్చి నృత్యం చేయడం ఆంగ్ల పత్రికలు కొన్నిటిలో విశేష వార్త అయింది.ప్రముఖ నటి ప్రియాంక చోప్ర, రణబీర్ కపూర్ ,రితేష్ దేశ్ ముఖ్,జాక్వలిన్ లు సంగీత్ కు వచ్చారని, ప్రియాంక చోప్ర ముందుగా కొన్ని నృత్యాలు చేశారని కధనం. సంగీత్ కు వచ్చిన పలువురితో ఆమె ఫోటోలు కూడా దిగారు. ఆ తర్వాత జాక్విలిన్ కూడా డాన్స్ చేశారు..అయితే దానం నాగేందర్ మాత్రం తనకు ఆరోగ్యం బాగోక సంగీత్ కు వెళ్లలేదని అంటున్నారు. ఎవరు వచ్చింది తనకు తెలియదని అన్నారు. తన బందువు అనిల్ కిషన్ చూసుకుంటున్నారని చెప్పారు. దానం నాగేందర్ ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచాలని అనుకున్నా,అది బయటకు వచ్చేసిందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. కాగా వీరు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రావడం విశేషం. దీని ఖర్చు కోట్లలో ఉంటుందని గుసగుసలు