కోటపల్లి మండలంలో దారుణం….
-దహన సంస్కరనాలకు వెళ్లిన బృందం పై తేనెటీగల దాడి.
-ఒకరు మృతి
కోటపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని బబ్బెరచెల్క గ్రామానికి చెందిన కొండపర్తి చంద్రకాంత(70)అనే మహిళ మృతి చెందగా ఆమెకు దహన సంస్కారాలు నికిత్తం వెళ్లిన గ్రామస్తుల పై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో మండలంలోని పాత దేవులవాడ గ్రామానికి చెందిన బొల్లంపల్లి బాపు(62) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో చంద్రకాంత మృతదేహానికి దహన సంస్కరాలు చేయకుండానే పారిపోయారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తేనెటీగలు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల ఎవ్వరు కూడా అటు వైపు వెళ్ళటానికి సాహసం చేయటం లేదు. తేనెటీగల దాడిలో గాయపడ్డ ఇద్దరిని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నారు.