కోటి లోపాల కొత్త బిల్లు
భూసేకరణ బిల్లు చాలా లోపాలతో ఉందనీ, భూమిని కోల్పోయే బాధితుల వైపు నుంచి ఆలోచించి బిల్లును సరిచేయాల్సిన అవసరం ఉందనీ అంటున్నారు లోకే రాజ్‌పవన్
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన జాతీయ భూసేకరణ ` పునరావాసం బిల్లు ` 2011 గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. సెప్టెంబర్ 7న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడ్డ ఈ బిల్లులో మొత్తం 13 అధ్యాయాలు, 107 సెక్షన్‌లు ఉన్నాయి. బిల్ నెం 77గా ప్రవేశపెట్టిబడిన ఈ బిల్లు డిసెంబర్‌లో చట్టంగా మారబోతున్నది. జుమ్మూ కాశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ చట్టం వర్తిస్తుంది. 1991 తర్వాత దేశవ్యాప్తంగా సరళీకరణ మరింత వ్యాపితమై ప్రనపంచీకరణ రూపాన్ని తీసుకుని ప్రజల మధ్య అసమానతలను తీవ్రం చేశాయి. ఇరవై ఏళ్లుగా ఈ ప్రపంచీకరణ ఫలితాల వల్ల దెబ్బతినని సగటు జీవి లేడంటే చాలా అశ్చర్యం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచీకరణ ప్రధానంగా కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు సహాయకారిగా ఉండడం, ఆ కంపెనీలకు తమ వ్యాపార ప్రయోజనాల కోసం భూమి అవసరమ వడం వల్ల ప్రపంచీకరణ విధులలో భూసేకరణ ముఖ్యమైన విధి అయిపోయింది. ప్రభుత్వాలను మచ్చిక చేసుకుని, చట్టాలలోని లొసుగులను వాడుకుని ఆయా కంపెనీలు భూసేకరణను జరుపుతూ తమ వ్యాపారాలను విస్తృత పరుచుకుంటున్నాయి. తద్వార భూములు కోల్పోయిన రైతులు, ప్రజలు బికారులై మిగిలిపో తున్నారు. తలదాచుకోవడానికి కూడా స్థలం లేకుండా అభాగ్యులై ఆవాసం క్సోం దేహీ అంటున్నాడు. ఇరవై ఏళ్లుగా ప్రపంచీకరణలో భాగంగా జరుగుతున్న ఈ భూసేకరణ లోతుల్లోకి వెళ్లి చర్చింకోకపోతే, ఆ ప్రక్రియ మూలాలను గురించి తెలుసుకోకపోతే రానురాను కార్పొరేట్ కంపెనీల వల్ల మాయమైపోతున్న ఊర్లు పట్టణాల ప్రజలు న్యాయానికి దూరంగా విసిరివేయబడతారు. కనుక బ్రిటిష్ వారు తమ ప్రయోజనాల కోసం భూసేకరణ చట్టం ` 1894లో ఉన్న లోపాలను సవరిస్తున్నామంటూ ప్రభుత్వం చేసిన ప్రస్తుత భూసేకరణపునరావాస బిల్లు ` 2011ఈ నేపధ్యంలో పరిశీలించి చర్చించుకోవాల్సిన సందర్భం వచ్చింది.ఈ బిల్లు ప్రభుత్వాల స్వంత వినియోగ పనులకు, ప్రజల కోసం ప్రైవేట్ కంపెనీలకు భూమిటవ బదలాయించడానికి, ప్రైవేట్ కంపెనీల అభ్యర్థనల మేరకు భూమి సేకరించడానికి ఉద్దేశించినది. అయితే గత చట్టంలో భూమిని ఏ అవసరాల కోసం సేకరించాలో ఉన్న నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్లుగా నిబంధనలకు విరుద్దమైన అవసరాల కోసం భూసేకకరణ జరిపారు. ఈ లోపాన్ని సరిదిద్దేలా ఈ కొత్త చట్టంలో నిబంధనలకు విరుద్దమైన అవసరాల కోసం భూమి సేకరిస్తే ఏ చర్యలు తీసుకోవాలో వివరించవలసి ఉంది. కానీ అలాంటి చర్యలను పేర్కొనలేదు. దీనివల్ల చట్టం మారినా గలత చటÊం మాదిరిగానే చట్ట విరుద్దంగా భూసేకరణ జరిపే అవకాశం ఉందని తెలుస్తొంది. గత చట్టంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల భూములను సేకరించకూడదని పేర్కొన్న వాస్తవానికి యధేచ్చగా సేకరిస్తూ పోయారు. అ అవకాశం చట్టంలోనే ఉండేది. ఈ చట్టం కూడా షెడ్యూల్డ్ ప్రాంతాలలోని వివాదాస్పద భూములను సేకరించరాదని పేర్కొంది. కానీ ఒకవేళ గతంలో లాగా సేకరిస్తే ఎలా? అనే ప్రశ్నకు మాత్రం బిల్లులో సమాధానం లేదు. గిరిజనుల భూములైన షెడ్యూల్డ్ భూములలో బడా కంపెనీలు తిష్టవేసిన అనేక ఉదాహరణలు కళ్లముందు కనిపిస్తున్నా కఠిన నిబంథనలు ఏర్పరచాలనే ఆలోచన బిల్లు తయారు చేసిన వారికి లేదు. కనుక చూడడానికి ఇది చిన్న లోపమే అయినా బడావ కంపెనీలు ఆ లొసుగుతో సునాయసంగా భూములను మింగేయగలవు.బిల్లులో పేర్కొన్న అంశాల నిర్వచనాలు చాలా మట్టుకు అసంబద్దం గా,గందరగోళ పరిచేలా ఉన్నాయి. బాధిత కుటుంబాలకు పునరావాసం, పనర్నివాసం కోష్ట్ర్సం నియమించబడిన అధికారిని అడ్మినిస్ట్రేటర్ గా పేర్కొన్నారు. అయితే అడ్మినిస్ట్రేటర్‌గా ఏ వ్యక్తిని నియమించాలో, ఆ వ్యక్తికి ఉండే పనరావాసం గురించి, భూసేకరణ గురించి తెలిసి ఉండే అధికారిని కాకుండా ప్రభుత్వం తనుకు అనుకూలమైన అధికారిని నియమించే అవకాశముంది. ప్రభుత్వాలు కంపెనీలకు ఏం న్యాయం చేయగలరు? కనుక ఉద్దేశ్యపూర్వకంగానే అడ్మినిస్ట్రేటర్ అర్హతలు ప్రకటించలేదని తెలుస్తోంది.ఇక భూ సేకరణకై ప్రభుత్వంచే గుర్తించబడ్డ స్థలాన్ని బాధితస్థలం అని నిర్వచించారు. ఇది పూర్తిగా అన్యాయమైన నిర్వచనం. ఒక ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న స్థలాన్ని మాత్రమే బాధిత స్థలంగా గుర్తించి, ఆ ప్రాజెక్ట్ ఉత్పత్తుల ఫలితంగా నష్టపోయే ప్రాంతాన్ని మాత్రం గుర్తించక పోవడం ఎంతవరకు సమంజసం? ఉదాహరణకు ఒక అణు విద్యుత్ ప్రాజెక్టు కోసం ఇరవై ఎకరాల భూసేకరణ జరిపితే దాని ఫలితంగా కాలుష్యం, విషవాయువులు వ్యాపించే వందల ఎకరాల భూమిని మాత్రం బాధిత స్థలంగా తీసుకోకుంటే ఆ భూమికి గానీ, అందులో నివసించే ప్రజలకు గానీ కలిగే నష్టానికి కారకులేవరు? వారి బాధలకు జవాబుదారీ ఎవరు?ఎవరి భూమిని సేకరించారో లేదా ఎవరు భూమి నుండి దూరం చేయబడ్డారో వారి కుటుంబాలను బాధిత కుటుంబాలు నిర్వచించారు. రైతులు,కూలీలు, కౌలుదార్లు, మూడు సంవత్సరాల నుండి భూమిలో పనిచేస్తున్నవారు, అడవులు, నీటి వనరులపై గత మూడు సంవత్సరాలుగా ఆధారపడతున్నవారు, వేటగాళ్లు, మత్య్సకారులు, పడవదార్లు, వివిధ పథకాలలో బాగంగా అసైన్డ్ భూములు కలిగి ఉన్నవారు.చ మూడేళ్లుగా పట్టణ ప్రాంతాలలో నివసిస్తూ వారిని బాధిత కుటుంబాలుగా వివరించారు. ఇందులో ప్రాతిపదికగా పేర్కొన్న మూడు సంవత్సరాలనేఎందుకు తీసుకోవల సి వచ్చిందో వివరణ లేదు. మూడు సంవత్సరాలు కాలాన్నే పరిమితిగా తీసుకోవడంలో గల హేతుబద్దత ఏమిటో అర్థం కావ డం లేదు. ఒక భూమినిటవ ఏడాదిగానో, రెండేళ్లుగానో విని యోగించుకున్న వారికి భూమి పోతే బాధ ఉండదా? అతని కుటుంబం బాధిత కుటుంబం కాదా? అలాగే ఒక పట్టణంలో మూడేళ్ల కంటే తక్కువ కాలం నుంచి నివసిస్తున్నంత మాత్రాన ఆ కుటుంబం మాత్రం బాధిత కుటుంబం కాకుండా పోతుందా? ఇదేం మెలికనో ముసాయిదా తయారు చేసిన వారికే తెలియాలి. మూడేళ్ల కాలం అని నిబంధన పెట్టి ఎన్నో పేద, మధ్యతరగతి కుటుంబాను భూసేకరణ రక్షణల నుంచి తప్పించపూనుకోవడం సబబు కాదు. అందుకే మూడేళ్లు అనే నిబంధనన వెంటనే తొలగించవలసిన అవసరముంది. అలాగే ప్రాజెక్టు పరిధిలో నివాసముంటున్న చిన్న చిన్న ఉపాధిలపై ఆధారపడ్డ స్థిర,సంచార కుటుంబాలన్నింటిని బాధిత కుటుంబాలుగా పరిగణిస్తున్నట్లు నిర్ధష్టంగా ప్రకటించాలి.వ్యవసాయం, తోటల పెంపకం, పాల, కోళ్ల, పట్టుపురుగుల, ఔషధ మొక్కల పెంపకం, పశు సంపదగల, తోట ఉత్పత్తులు గల భూములను వ్యవసాయ భూమిగా నిర్వచి ంచారు. అయితే ఈ నిర్వచనంలో ఇంతకంటే స్పష్టత లేకపోవడం వల్ల అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి, బీడు భూములు అని ఏ ప్రాతిపదికన పరిగణిస్తా రు? అంటే ఉదాహరణకు ఏడాదిగా నో రెండేళ్లుగానో బీడు పడి ఉన్న భూమిని వ్యవసాయ భూమిగా పరిగణిస్తారా లేదా? ఎన్ని సంవత్సరాలుగా బీడు ఉంటే పరిగణించరు? అనే స్పష్టత నిర్వ్ణచనంలో లేదు. కనుక వెంటనే దానికి స్పష్టత ఇస్తూ కనీసం 15 సంవత్సరాల క్రితం నుండి బీడు ఉంటేనే దాన్ని బీడుగా చూడాలి. లేకుంటే వ్యవసాయ భూమిగానే పరిగణిం చాలి. మరో అస్పష్టత ఏమిటంటే భూమిని ఫలానా వ్యక్తిదనో, కుటుంబానిదనో ఎలా నిర్ణయి స్తారో వివరించలేదు. అయితే మరో చోట పట్టా ఆధారంగానే పరిగణిస్తామని అన్నారు. అదే జరిగితే చాలా మంది దళితులు, పేదరైతులెఉ పేదరికం కారణంగా కనీసం పట్టాకయ్యే ఖర్చులు కూడా భరించలేని స్థితిలో పట్టాలు లేకుండానే సాగు చేసుకుం టున్నారు. అలాగే అనేక మంది గిరిజనులు అటవీ ప్రాంతాలలో ఆదివాసి భూములను ఉపయోగిం చుకుంటున్నారు. ఈ పట్టా నిబంధన నిజమే అయితే దానివల్ల పేదవాళ్లయిన దళితులు, గిరిజనులు చాలా నష్టపోతారని గమనించాలి. కనుకు ఇందుకు సంబంధించిన స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంది. భూమిని ఏ అవసరాల కోసం సేకరిస్తారో తెలిపేందుకు ప్రజా ప్రయోజనం అనే పదాన్ని నిర్వచించారు. కేంద్ర నావిక, మిలిటరీ, వైమానిక, సైనిక, రక్షణ, రైల్వే, జాతీయ, రహదార్లు, రేవులు, నీటిపారుదల, విద్యుత్,విద్యా, వైద్య, వ్యవసాయిక, పరిశోధన, వస్తు ఉత్పత్తి అవసరాల కోసం చేసే ఏ పనులైనా ప్రజా ప్రయోజనం పరిధిలోకి ఉత్పత్తి అవసరాల కోసం చేసే ఏపనులైనా ప్రజా ప్రయోజనం పరిధిలోకి వస్తాయని నిర్వచించారు. అసలు ఎలాంటి పని అయినా పై పనులలో ఏదో ఒక దానికిందకు వస్తుంది. ఏదో ఒక రూపంలో ఆయా పనుల్లోని ఏదో ఒక దానికిందకు వస్తుంది. ఏదో ఒక రూపంలో ఆయా పనుల్లోని ఏదో ఒక అవసరం కిందకు వస్తుంది. అలాంటపుడు భూసేకరణలో నుంచి ఏ పనులను మినహాయించా రో తెలియడం లేదు. ప్రతి పని ప్రజా ప్రయోజనం పరిధిలోకి వచ్చేట్లుగా భాషా చాతుర్యంతో నిర్వచించి, ప్రజా ప్రయోజనార్ధమే అంటూ భూమిని సేకరించే హక్కును పొందడం అంటే తమకిష్టమైన ఏ పనికోసమైనా భూమిని సేకరించుకోమని అభిప్రాయమివ్వడమే. ఎవరైనా అడ్డు చెప్తే అది ప్రజా ప్రయోజనం కోసమే అని దబాయించడానికే ఈ నిర్వచనాన్ని జోడిరచారు. యధేచ్చగా ఎవరూ అడ్డు చెప్పకుండా భూమిని సేకరించే రాజమార్గానికి ఈ నిర్వచనం వీలు కల్పిస్తుంది. ఇదే నిర్వచనంలో సేకరించదలచిన భూమిలో 80 శాతం బాధిత వ్యక్తుల అంగీకారం మేరకు భూమి సేకరించవచ్చునని చెప్పబడిరది. అంటే మిగిలిన ఇరవై శాతం మంది ఇష్టాయిష్టాలతో, అంగీకారాలతో సంబంధం లేకుండా భూసేకరణ జరపవచ్చునన్న మాట. తమ అంగీకారం లేకుండా ఆక్రమించుకోవద్దని వ్యతిరేకించినందుకు ఈ ఇరవై శాతం మైనారిటీలో ఉన్నారన్న కారణంగా భూమిని కోల్పోవాలన్న మాట. ఇది ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడమే అవుతు ంది. కనుక 80 శాతాన్ని వందశాతంగా మార్చాలి. అందరూ ఒప్పుకుంటేనే ఈ ప్రాంతంలో భూమిని సేకరించాలి. లేకుంటే మరోచోటును వెతుక్కునే లాగా నిర్వచనాన్ని మార్చాలి.