బయోసైన్స్‌, కృత్రిమ మేధ రంగాలకు తెలంగాణ అనుకూలం

` రాష్ట్రంలో రూ.2,125 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన షైవా గ్రూప్‌ ఎంవోయూ
` ఏడాదిన్నరలో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు
` ప్రైవేటు రంగంలో లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు
` ఐటి మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి):తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల్లో చూపించే ప్రభుత్వం అని ఐటీ- శాఖా మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. తెలంగాణ ప్రతిభకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారిందన్నారు. పెట్టుబడుల విషయంలో ప్రతిపక్షాలు దుష్పచ్రారాలు చేయొద్దని, తెలంగాణకు వచ్చే పెట్టుబడులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు చూసి షైవ గ్రూప్‌ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకుందని తెలిపారు. తెలంగాణలో షైవా గ్రూప్‌ భాగస్వామిగా మారిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. షైవా గ్రూప్‌, టారానిస్‌ క్యాపిటల్‌ కలిపి రాష్ట్రంలో రూ.2,125 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మంగళవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. బయోసైన్స్‌, కృత్రిమ మేధలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమన్నారు. తెలంగాణ పురోగతిలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏడాదిన్నరలో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఏడాదిన్నరలో రూ.3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టు-బడిదారులు ముందుకు వస్తున్నారన్నారు. యువత మన ఆస్తి.. వారిలో నైపుణ్యాలు నింపేందుకు స్కిల్‌ యూనివర్సిటీ- ఏర్పాటు- చేశామని తెలిపారు. రాష్ట్రం అవకాశాల గని.. ఆవిష్కరణలకు, అవకాశాలకు, ప్రతిభకు కేంద్రమని పేర్కొన్నారు. అంతర్జాతీయ భాగస్వాములను రాష్ట్రం ఆకర్షిస్తోందన్నారు. 18 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయని, లక్ష మందికి తెలంగాణ యువతకు ఉపాధి లభించిందని మంత్రి శ్రీధర్‌ బాబు చెప్పుకొచ్చారు. ’తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు చూసి శైవ గ్రూప్‌ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకుంది.13 వందల కోట్లతో బయోటెక్‌ సంస్థ పెట్టుబడులు పెడుతున్నారు. ఐదు సంస్థల్లో 2100 కోట్లు-, 5 వేల మందికి ఉపాధి కలగనుంది. సాంకేతిక పరమైన కొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం పెట్టుబడి దారులకు సహకారం అందిస్తుంది. 18 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు, లక్ష మందికి తెలంగాణ యువతకు ఉపాధి లభించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మొదటి అడుగు నుంచే విమర్శలు చేస్తున్నారు. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల్లో చూపిస్తున్నాం’ అని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. ’పెట్టుబడులు రావడం లేదు, కంపెనీలు పోతున్నాయి అనే విమర్శలకు ఇది కౌంటర్‌ అన్నారు. తెలంగాణకు వచ్చే పెట్టు-బడులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా?. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీతో యువతకు మరింత ఉపాధి లభించనుంది. తెలంగాణ ప్రతిభకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారింది. పెట్టుబడుల విషయంలో ప్రతిపక్షాలు దుష్పచ్రారాలు చేయొద్దు. పరిశ్రమల వాతావరణాన్ని డిస్టబ్ర్‌ చేయొద్దు. భవిషత్తులో పెద్ద సంఖ్యలో పెట్టు-బడులు తీసుకొస్తాం’ అని మంత్రి శ్రీధర్‌ బాబు చెప్పుకొచ్చారు.