కోల్‌కత్తాలో మహావిషాదం

5

– కుప్పకూలిన ఫ్లైఓవర్‌

– 18 మంది మృతి

కోల్‌కతా,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):పశ్చిమ్‌బంగ రాజధాని నగరం కోల్‌కతాలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. ఉత్తర ప్రాంతంలోని గిరీష్‌ పార్క్‌ సవిూపంలో నిర్మాణంలో ఉన్న వివేకానంద ఫ్లైఓవర్‌ వంతెన కుప్పకూలడంతో ఇప్పటి వరకు 18 మంది మృత్యువాతపడ్డారు. గాయపడిన 62 మందిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరికొంత మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారు.రద్దీగా ఉండే రహదారిపై ఈ ఫైఓవర్‌ కుప్పకూలడంతో కింద ఉన్న జనం శిథిలాల కింద చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన పారామిలటరీ బలగాలు శిథిలాలను తొలగించి మృతదేహాలను, గాయపడిన వారిని వెలికి తీస్తున్నాయి. రద్దీగా ఉండే కూడలి సవిూపంలో ఈ ఘటన జరగడంతో అక్కడి ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 2011 సంవత్సరంలోనూ నగరంలోని ఆల్టాడంగా ప్రాంతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.రెండు కిలోవిూటర్ల పొడవు గల ఈ ఫ్లైఓవర్‌ని హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్‌సీఎల్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ విషయమై ఈ సంస్థ అధికారి పాండురంగారావు మాట్లాడుతూ… ఇది దేవుడి లీలేనని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఫ్లైఓవర్‌ కూలిన దృశ్యం అంతా రహదారిపై గల సీసీ టీవీలో రికార్డయ్యింది. అది కూలే ముందు దాని కింద ఆటోలు, కార్లు, కొంత మంది ప్రజలు ఉన్నట్లు కనిపిస్తోంది.రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రెప్పపాటులో తమ కళ్ల ముందే వందలాదిమంది శిథిలాల కింద చిక్కుకోవడంతో స్థానికులను కలచివేసింది. భయంతో పిల్లలు, మహిళలు ఏడుస్తూ విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన గురించి ఓ ప్రత్యక్ష సాక్షి విూడియాతో మాట్లాడుతూ..కట్టడం ఓవర్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ హఠాత్పరిణామానికి వెన్నులో వణుకు పుట్టిందని చెప్పాడు. ప్రమాద ఘటనపై మరికొందరు ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ స్థానిక ప్రజలు భయపడిపోయారు. భయంతో పిల్లలు, మహిళలు ఏడుస్తున్నారు

శిథిలాల కింద 150 మంది చిక్కుకున్నారని భావిస్తున్నారు. నిన్న కాంక్రీట్‌, సిమెంట్‌ వేశారు. ఈ రోజు అకస్మాత్తుగా కూలిపోయిందని చెప్పారు. ఫ్లై ఓవర్‌ కూలిన ఘటనలో పదిమంది మరణించగా, మరో 150 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. కోల్కతాలోని గణెళిశ్‌ థియేటర్‌ సవిూపంలోని ప్రమాద స్థలలో సహాయక చర్యలు చేపడుతున్నారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. 2011 సంవత్సరంలోనూ నగరంలోని ఆల్టాడంగా ప్రాంతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు గ్యాస్‌ కట్టర్‌లను ఉపయోగిస్తున్నారు. నిర్మాణంలో భాగంగా సిమెంటు, కాంక్రీట్‌ను బుధవారమే వేశారని, అయితే ఈ రోజు అది కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.దీని నిర్మాణం 2009లో మొదలైంది. 2010లోనే అది పూర్తి కావాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 సార్లు గడువు పొడిగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. 2011లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని త్వరలో పూర్తి చేస్తామని మాట కూడా ఇచ్చారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పశ్చిమ మిడ్నాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచార కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సవిూక్షించారు. ఈ  ఘటనకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని భాజపా నేత కైలాశ్‌వర్గీయ అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీజీతో మాట్లాడానని పరిస్థితిని సవిూక్షిస్తున్నామని ఆయన ట్వీట్‌ చేశారు.

సహాయక చర్యలు వేగవంతం

ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు గ్యాస్‌ కట్టర్‌లను ఉపయోగిస్తున్నారు. 17 క్రేన్లు శిథిలాల్ని తొలగించడంలో నిమగ్నమయ్యాయి. స్థానికులు కూడా ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. క్షతగాత్రుల్ని కలకత్తా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేర్పిస్తున్నారు.ఫ్లైఓవర్‌ నిర్మాణంలో భాగంగా సిమెంటు, కాంక్రీట్‌ను బుధవారమే వేశారని, అయితే ఈ రోజు అది కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

కంట్రోల్‌ రూం ఏర్పాటు

ఈ ప్రమాద వివరాల్ని బాధిత కుటుంబాలు తెలుసుకునేందుకు వీలుగా అక్కడ ఓ కంట్రోల్‌ రూంని ఏర్పాటు చేశారు. 1070 నెంబరుతో హెల్ప్‌లైన్‌ నెంబర్‌ని ఏర్పాటు చేశారు.

ఘటనాస్థలానికి… మమత

పశ్చిమ మిడ్నాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచార కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సవిూక్షించారు.

మోదీగ్భ్భ్రాంతి

ప్రమాదం విషయం తెలిసిగ్భ్భ్రాంతికి గురయ్యానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు తన ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల చుట్టూ తిరుగుతున్నాయన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. పరిస్థితుల్ని సవిూక్షిస్తున్నామన్నారు.

రాజ్‌నాథ్‌ సంతాపం

ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీజీతో మాట్లాడానని పరిస్థితిని సవిూక్షిస్తున్నామని ఆయన ట్వీట్‌ చేశారు.

మరిన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల్ని పంపిస్తాం : రిజిజు

ఈ ఘటనపై కేంద్ర ¬ం శాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు స్పందించారు. ఇప్పటికే ఘటనా స్థలికి కొన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల్ని పంపించామని చెప్పారు. మరికొన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌, పారా మిలిటరీ బృందాల్ని అక్కడికి పంపిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికేఅత్యవసరంగా సహాయక చర్యల్ని ప్రారంభించిందని తదుపరి ఏ సహాయమైనా కేంద్రం చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

2009 నుంచీ కొనసాగుతున్న నిర్మాణం

ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం 2009లో మొదలైంది. 2010లోనే అది పూర్తి కావాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 సార్లు గడువు పొడిగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. 2011లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని త్వరలో పూర్తి చేస్తామని మాట కూడా ఇచ్చారు. అయితే ఈ ఘటన అనంతరం మమత మాట్లాడుతూ.. 2009లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ టెండర్‌ని పాస్‌ చేశారని చెప్పారు.

ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత: భాజపా

ఈ ఘటనకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని భాజపా నేత కైలాశ్‌వర్గీయ అన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఇదిలా ఉండగా భాజపా నేత రూపాగంగూలీ సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితుల్ని పరిశీలించారు.

‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ వల్లే ఫ్లై ఓవర్‌ కూలింది..’

కోల్‌కతాలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆ ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులను చేస్తున్న ఐవీఆర్‌సీఎల్‌ కంపెనీ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. హిందీలోని ‘ఓ మై గాడ్‌’, తెలుగులో వచ్చిన ‘గోపాల గోపాల’ చిత్రంలో ఉపయోగించిన ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ పదాన్ని ఐవీఆర్‌సీఎల్‌ యాజమాన్యం కూడా ఉపయోగించుకుంది. ప్రమాదానికి తమ తప్పేంలేదని… దానికి కారణం ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ అంటూ కొత్త భాష్యం చెప్పింది.హైదరాబాద్‌ కు చెందిన ఐవీఆర్‌సీఎల్‌ సంస్థ పై మూడు, మరో నలుగురు అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఫ్లై ఓవర్‌ నిర్మాణం 2010లోనే పూర్తి కావాల్సి  ఉండగా, ఆ సంస్థ గడువును పొడిగిస్తూ వచ్చింది. అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రావటంతో.. ఐవీఆర్‌సీఎల్‌ సంస్థ హడావుడిగా ఫ్లై ఓవర్‌ పనులు పూర్తి చేసేందుకు సన్నద్ధమైందని విమర్శలు వెల్లువెత్తాయి.

ఆ ఘటన చాలా బాధాకరం: ప్రధాని మోదీ

కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ కూలిపోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సహా జాతీయ నేతలు తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనగ్భ్భ్రాంతికరం, చాలా

బాధాకరమని మోదీ పేర్కొన్నారు. పరిస్థితిని సవిూక్షించి, సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మోదీ.. కోల్‌కతా ఫ్లై ఓవర్‌

మృతులకు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ రోజు జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, మరో 150 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఎవరేమన్నారంటే..

ఈ ఘటన జరగడం దురదృష్టకరం. జాతీయ విపత్తు నివారణ బృందం సహాయక చర్యలు చేపడుతోంది- కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

కోల్‌కతా ఫ్లై ఓవర్‌ కూలిన ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. శిథిలాల చిక్కుకున్న వారు, గాయపడ్డవారు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా-

గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌

నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ కూలిపోవడం హృదయవిదారకం. చనిపోయినవారికి సంతాపం తెలియజేస్తున్నా. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నా – కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

ఈ ఘటన చాలా బాధాకరం. సహాయక చర్యల్లో పాల్గొనాలని పశ్చిమబెంగాల్‌ బీజేపీ శాఖకు సూచించా – బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా

‘భయంతో వెన్నులో వణుకు పుట్టింది’

పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఫ్లై ఓవర్‌ కూలిపోయిన ఘటన స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రెప్పపాటులో తమ కళ్ల ముందే

వందలాదిమంది శిథిలాల కింద చిక్కుకోవడంతో స్థానికులను కలచివేసింది. భయంతో పిల్లలు, మహిళలు ఏడుస్తూ విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన గురించి ఓ ప్రత్యక్ష సాక్షి విూడియాతో మాట్లాడుతూ.. ఫ్లై ఓవర్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ హఠాత్పరిణామానికి వెన్నులో వణుకు పుట్టిందని చెప్పాడు. ప్రమాద ఘటనపై మరికొందరు ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..స్థానిక ప్రజలు భయపడిపోయారు. భయంతో పిల్లలు, మహిళలు ఏడుస్తున్నారు శిథిలాల కింద 150 మంది చిక్కుకున్నారని భావిస్తున్నా నిన్న కాంక్రీట్‌, సిమెంట్‌ వేశారు. ఈ రోజు అకస్మాత్తుగా కూలిపోయింది

మమతపై హత్య కేసు నమోదు చేయాలి

కోలకతా లో ఫ్లై ఓవర్‌ కూలిన ఘటనపై  మమతా బెనర్జీ ప్రభుత్వంపై  బీజేపీ తన దాడిని ఎక్కుపెట్టింది. రాష్ట్రంలో కొనసాగుతున్న  అవినీతి పాలనకు  ఈ ఘటనే తార్కాణమని బీజేపీ  మండిపడింది  పశ్చిమ బెంగాల్‌ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్‌  కైలాష్‌  విజయ వార్గీయ ఫ్లై ఓవర్‌ కూలిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. మమత ప్రభుత్వం అవినీతి పాలనకు ఇదొక  అద్భుతమైన ఉదాహరణ అని ఆయన ట్విట్‌ చేశారు. కైలాష్‌ విజయ వార్గీయ.. తన వరుస ట్విట్లలో మమత పై విరుచుకుపడ్డారు.

ఈ సంఘటనపై మమతపై హత్యకేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌  చేశారు. ఆమె అవినీతి వల్ల అమాయక ప్రజలను బలి తీసుకుందన్నారు. దీనికి  ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. మృతులకు సంతాపం తెలిపిన కైలాష్‌ విజయ వార్గీయ క్షతగాత్రులు  త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అటు నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ కూలిపోవడం బాధ గలిగించిందని జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా   ట్విట్‌ చేశారు. సహాయక చర్యల్లో సహకరించాల్సిందిగా పార్టీ రాష్ట శాఖ పార్టీకి  ఆదేశాలు జారీచేసినట్టు   ఆయన తెలిపారు.కాగా ఉత్తర కోల్‌కతాలోని గణేశ్‌ థియేటర్‌ గిరీశ్‌ పార్క్‌ ఏరియా సవిూపంలో నిర్మాణంలో ఉన్న  ఫ్లైఓవర్‌ హఠాత్తుగా కూలిపోయింది.  ఈ ఘటనలో  14 మంది

మరణించగా, మరో 100 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.